న్యూఢిల్లీ: వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే ధ్యేయమన్నారు. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలోవిజయసాయిరెడ్డి మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..లక్నోలో సెక్రటేరియట్ ఉంటే అలహాబాద్‌లో హైకోర్టు ఉందని గుర్తు చేశారు. రెండు రాజధానులు ఇప్పటికే అమలులో ఉన్నాయని చెప్పారు.
ఛత్తీష్ గఢ్ రాజధాని రాయ్‌పూర్..హైకోర్టు బిలాస్ పూర్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అందుకే మూడు మూడు రాజధానులు ప్రతిపాదించామన్నారు. కొంత మంది మూడు రాజధానులను అడ్డుకోవాలని చూస్తున్నారు. రాజధానిని చేపట్టడం రాష్ట్రం పనికాదని కొందరు అంటున్నారు. కొన్ని రోజుల్లో సుప్రీం కోర్టు దీనిపై విచారణ చేపట్టనుందని చెప్పారు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా వాగ్ధానం చేశారు. పార్లమెంట్ తలుపులు మూసి బిల్లు పాస్ చేశారు. ప్రత్యేక హోదా పదేళ్ల పాటు ఇవ్వాలని ఆ రోజు వెంకయ్య నాయుడు అడిగారు. అందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాగ్ధానాన్ని ఇప్పటికీ నిలబెట్టుకోలేదన్నారు.నాటి ప్రధాని ఇచ్చిన వాగ్ధానాన్ని అమలు చేయాలన్నారు. పార్టీలు మారినా ..కేంద్రం ఇచ్చిన హామీ నెరవేర్చాలి.కాంగ్రెస్, బీజేపీ వైఫల్యం వల్లే ఏపీకి అన్యాయం జరిగింది. విభజన కారణంగా ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది..అందుకే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇది విభజనపై ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బెంగళూరు మెట్రోకు బడ్జెట్‌లో భారీగా నిధులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు పట్టించుకోలేదు..? ఏపీపై ఈ సవతి ప్రేమ ఎందుకు..?. వైజాగ్ మెట్రోకు ఎందుకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
వైజాగ్ మెట్రోపై సవతి తల్లి ప్రేమ ఎందుకని రాజ్యసభలో విజయ సాయి రెడ్డి ప్రశ్నించారు.