

















తాడేపల్లి: పచ్చమీడియాలో చంద్రబాబు భజన పరాకాష్టకు చేరిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ‘బాబు సీఎంగా లేని ఆంధ్ర రాష్ట్రం నాశనమై పోవాలని కోరుకుంటున్నాడు కిరసనాయిలు. సీఎం వైయస్ జగన్ గారు రాష్ట్ర సమస్యల గురించి గంటన్నర సేపు ప్రధాని మోదీ గారితో సమావేశమైతే పీపీఏలపై మందలించాడని సైనైడ్ వార్తలు కుమ్మరించాడు. జయము జయము చంద్రన్న భజన పరాకాష్టకు చేరింది’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
అప్పట్లో తిప్పిన చక్రాలు ఏమయ్యాయో..?
అదే విధంగా ‘ఏ రాష్ట్రంలో సీఎం ప్రమాణ స్వీకారం ఉన్నా నమ్మకస్థులను పంపి ఇన్విటేషన్ సంపాదించేవాడు. ఎన్డీయేలో లేకున్నా ఇప్పుడు కేజ్రీవాల్ పదవీ ప్రమాణానికి వెళ్లే దమ్ము చంద్రబాబుకు లేదు. బీజేపీ పెద్దల కంట్లో పడితే పాత కేసులు ఎక్కడ తిరగతోడతారో అని వణుకుతున్నాడు. అప్పట్లో గిరగిరా తిప్పిన చక్రాలు ఏమయ్యాయో?’ అని మరో ట్వీట్ చేశారు.