‘40 ఇయర్స్‌ ఇండస్ట్రీ సర్వైవల్‌ సీక్రెట్‌ ఇదే’

అమరావతి: అంతర్జాతీయ మీడియాను మ్యానేజ్‌ చేసినోళ్లకు దేశీయ పత్రికలు ఒక లెక్కా అంటూ చంద్రబాబుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘ఎకనమిక్‌ టైమ్స్‌ ఏదో రాసిందని కిరసనాయిలు తెగ మురిసిపోతున్నాడు. అంతర్జాతీయ మీడియాను మ్యానేజ్‌ చేసినోళ్లకు దేశీయ పత్రికలు ఒక లెక్కా. సంపాదించిన లక్షల కోట్లలో ఉల్లి పొరంత ఖర్చుపెడితే నిత్యం ఏదో కుట్రను ప్రచారంలో పెట్టొచ్చు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ సర్వైవల్‌ సీక్రెట్‌ ఇదే కదా!’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఎల్లోమీడియా ఏడుపు మొదలైంది
అదే విధంగా ‘ఈఆర్‌సీ ప్రకటించిన కరెంట్‌ ఛార్జీల టారిఫ్‌ను లోతుగా పరిశీలించకుండానే వడ్డింపు, వాయింపు, బాదుడు అంటూ ఎల్లో మీడియా ఏడుపు మొదలెట్టింది. కొత్త టారిఫ్‌తో కోటీ 43 లక్షల మంది వినియోగదారులకు 60 కోట్ల వరకు భారం తగ్గుతుందన్న వాస్తవాన్ని కప్పిపెట్టి దుష్ప్రచారానికి తెర తీసింది’ అని మరో ట్వీట్‌ చేశారు. 
 

Back to Top