వైయస్‌ జగన్‌ దేశంలోనే నంబర్‌ వన్‌ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారు

వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య

అమరావతి:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దేశంలోనే నంబర్‌ వన్‌ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న ముఖ్యమంత్రిగా నిలిచారని వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య కొనియాడారు. ఇవాళ వైయస్‌ఆర్‌సీపీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌ రావు, నిరంజన్‌రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం ఎంపీ అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల హక్కుల గురించి పోరాడుతున్న నాకు మరింత పోరాటం చేసేందుకు, ఈ వర్గాలకు మరింత మేలు చేసేందుకు ఈ అవకాశం కల్పించింనందుకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సీఎం వైయస్‌ జగన్‌ దేశంలోనే నంబర్‌ వన్‌ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న ముఖ్యమంత్రి. అంతేకాదు..గతంలో పరిపాలించిన మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అధిగమించి దేశ చరిత్రలో సీఎం వైయస్‌ జగన్‌ రికార్డు సృష్టించారు. పార్లమెంట్‌లో విజయసాయిరెడ్డి ద్వారా బీసీ బిల్లు పెట్టించారు. ఇది చరిత్రాత్మకమైన ఘట్టం. ఇందుకోసం మేం గతంలో వేల ఉద్యమాలు చేశాం. ఎవరూ కూడా బీసీ బిల్లు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. దేశంలో 9 బీసీ పార్టీలున్నా కూడా బీసీ  బిల్లు పెట్టలేదు. వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టడం సామాజిక న్యాయానికి సంకేతం. 50 శాతం పోస్టులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని చట్టాలు చేశారు. పేద వర్గాలు శశ్వాత సమానత్వంతో అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన సాగిస్తున్నారు. అమ్మ ఒడి ద్వారా ప్రతి ఒక్కరు తమ పిల్లలను చదివించాలని విజనరీగా వైయస్‌ జగన్‌ ఈ పథకాన్ని తీసుకువచ్చారు. అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని స్టడీ చేస్తున్నాయి. విద్య ద్వారానే సమాజంలో సమూలమైన, శాశ్వతమైన మార్పు వస్తుంది. ప్రతిదీ ప్రాక్టికల్‌గా వైయస్‌ జగన్‌ ఆచరించి అమలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలు చాలా గొప్పవి. లోటు బడ్జెట్‌ ఉన్నా కూడా వైయస్‌ జగన్‌ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటం దేశం మొత్తం ప్రశంసిస్తోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగం ప్రకారం అన్ని రంగాలను జనాభా ప్రకారం వాటా ఇస్తూ అన్ని వర్గాల సర్వతాముఖావృద్ధికి సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. ఓ గొప్ప విజనరీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఈ వర్గాలను అభివృద్ధి చేస్తూ అత్యంత ధైర్య సహసాలతో పరిపాలన సాగిస్తున్నారు. అందరం కూడా వైయస్‌ జగన్‌కు మద్దతుగా ఉండాలి. సెంటిమెంట్లతో వెనుకడుగు వేయవద్దు. మనకు మంచి ముఖ్యమంత్రి దొరికారు. కూడు, గూడు, ఉద్యోగాలు ఇస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు అండగా నిలుద్దాం. అన్ని వర్గాలు కూడా వైయస్‌ జగన్‌ పరిపాలనను హర్షించాలి. రాష్ట్రంలో 15 మందిని బీసీ మంత్రులను చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తే మనం, మన పిల్లలు అభివృద్ధి చెందుతారు. అధికారాన్ని పేదల ముంగిట పెట్టిన సీఎం వైయస్‌ జగన్‌కు అందరం అండగా ఉందామని ఆర్‌.కృష్ణయ్య కోరారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top