సీఎం వైయ‌స్ జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే చేస్తా..

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి

నెల్లూరు: పార్టీ మార్పుపై ఉత్త ప్రచారాలపై నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఏడాది నుంచి ఇదే మాట చెబుతున్నా..నాపై వస్తున్న రూమర్స్‌ నమ్మొద్దు. నాపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం వైయ‌స్ జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే చేస్తా.. అసెంబ్లీయా.. పార్లమెంట్‌ బరిలోనా అనేది అధినేతను కలిసిన తర్వాత క్లారిటీ ఇస్తానని ఆయన చెప్పారు. 

Back to Top