తాడేపల్లి: అది బీసీ డిక్లరేషన్ కాదు..చంద్రబాబు చీటింగ్ (బీసీ) డిక్లరేషన్ అని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడిన అంశాలు: *మసాలా దట్టించి పాత హామీలను బయటకు తీసిన బాబు:* – పాత హామీలన్నిటికీ మసాలా దట్టించి మళ్లీ బీసీలను మోసం చేయడానికి ఇస్తున్న డిక్లరేషన్ అది. – అది బీసీ డిక్లరేషన్ కాదు..బాబు చీటింగ్ డిక్లరేషన్. – బీసీలకు బాంధవుడు జగనన్న అయితే..బీసీలకు రాబంధువు చంద్రబాబు. – బీసీలకు వెన్నెముక జగనన్న అయితే..వెన్నుపోటు చ్రందబాబు. –బీసీల ఆత్మగౌరవం జగనన్న అయితే..వారిని అణగదొక్కేసింది చంద్రబాబు. – అప్పు ఎగ్గొట్టే వాడు ఎంత వడ్డీనైనా కడతాను అంటాడు. అలానే చెప్పింది చేయడు కాబట్టి చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు. – చంద్రబాబు నాయుడు పది హామీలు ఇచ్చారు. దానికి ముందు గతంలో మీరిచ్చిన 143 హామీలను కూడా రాసి, ఎన్ని నెరవేర్చారో చెప్తే బాగుండేది. – కానీ పది శాతం హామీలను కూడా నెరవేర్చలేదు కాబట్టి గత హామీలను తుంగలో తొక్కారు. – ఈ ఆంద్రప్రదేశ్‌లో చీటింగ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు. అబద్దానికి ఆధార్ కార్డు. మోసానికి ఫ్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబే. – మీరు ఏమి చెప్పినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. – రాష్ట్రంలో బీసీల ద్రోహి చంద్రబాబు. – మీ ఐదేళ్లలో బీసీలకు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇస్తానని ఎగ్గొట్టిన ద్రోహి మీరు కాదా? – బీసీ కమిషన్ అని చెప్పి ఆ ఊసే లేకుండా చేసిన ద్రోహి మీరు కాదా? – బీసీలు జడ్జిలుగా పనికి రారని కేంద్రానికి లేఖ రాసింది మీరు కాదా? – ఏటా పదివేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి రూ.19వేల కోట్లు కూడా ఖర్చు చేయని బీసీ ద్రోహి మీరు కాదా? – ఆదరణ పేరుతో మీ ఐదేళ్లలో నిధులు స్వాహా చేసింది మీరు కాదా? – బీసీల తోకలు కత్తిరిస్తాను, అంతు చూస్తానని అవమానించిన వ్యక్తి చంద్రబాబు. – బీసీ ప్రధాన మంత్రిని వ్యక్తిగతంగా దూషించి, అతని తల్లిని, భార్యను కూడా దూషించిన బీసీ వ్యతిరేకి చంద్రబాబు. *బాబు దృష్టిలో బీసీ అంటే..బాబు క్యాస్ట్..!:* – చంద్రబాబు తన ‘బీసీ’లకు మాత్రం న్యాయం చేశారు. ఆయన దృష్టిలో బీసీ అంటే బాబు క్యాస్ట్. – పదవులిచ్చినా, కాంట్రాక్టులిచ్చినా వారి సామాజికవర్గానికే ఇచ్చుకున్నాడు. – ఆయనకు సేమ్ క్యాస్ట్ (ఎస్సీ)కు కూడా మేలు చేసుకున్నాడు. – రాజ్యసభకు మా బీసీలను ఒక్కరినైనా పంపావా చంద్రబాబూ..? – మా జగనన్న నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సాధికారత కల్పించారు. – బీసీ పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్ గారు నిలిచారు. బీసీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా మాకు ఈ రాష్ట్రంలో న్యాయం జరిగింది. – ఒక బీసీ ఎమ్మెల్సీగా సగర్వంగా తెలుపుతున్నా. – రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. – జగనన్న పాలనలో బీసీలకు మోసం జరిగిందని అంటున్నారు. మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు సిద్ధమా? – మా జగనన్న పాలనలో బీసీలకు ఏం జరిగింది..మీ పరిపాలనలో బీసీలకు ఏం జరిగిందో చర్చించడానికి మేం సిద్ధం. – ఎక్కడకు వెళ్దామో చెప్పండి..అక్కడికే వచ్చి చర్చిద్దాం. – మీరు చెప్పుకోడానికి ఒక్క పథకం కూడా లేని పరిస్థితిలో మీరు బతుకుతున్నారు. – ఈ ఐదేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాలకు పంపితే..అందులో రూ.1.22 లక్షల కోట్లు కేవలం బీసీలకే చేరింది. – దీన్ని కాదనే దమ్ము ధైర్యం మీ కూటమిలో ఎవరికైనా ఉందా? – నాన్ డీబీటీతో కూడా కలుపుకుంటే బీసీలకు రూ.1.73 లక్షల కోట్లు బీసీలకు అందింది. – మీ 14 ఏళ్ల పరిపాలనలోనైనా ఇంత మేలు బీసీలకు చేశారా? – ఏమీ చేయకుండా మీరు బీసీలను ఏ ముఖం పెట్టుకుని బీసీల ఓట్లు అడుగుతున్నారా? – బీసీ డిక్లరేషన్ అనే పేరుతో ప్రజల ముందుకు రావడానికి మీకు కనీసం సిగ్గుందా? – జగన్ గారు ఏం మోసం చేశాడో చెప్పాలి. 124 సార్లు బటన్ నొక్కి బీసీల ఖాతాల్లో డబ్బు వేయడం మోసమా? – శాశ్విత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయడం జగన్ గారు చేసిన మోసమా? – బీసీ కులగణన కూడా మా జగనన్న సారధ్యంలోనే చేపట్టారు. – ఇచ్చిన ఇళ్ల పట్టాలు, గృహాల్లో మెజార్టీ బీసీలకే దక్కాయి. – స్పీకర్‌గా మా బీసీనే చేశారు. క్యాబినెట్లో 11 మంది బీసీలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. – ఉద్యోగ అవకాశాల్లోనూ బీసీలకు పెద్ద పీట వేస్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్. – గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో 60 శాతం బీసీలే ఉన్నారు. 54 వేల మందికి శాశ్విత ఉద్యోగాలు వచ్చాయి. – 2.14లక్షల శాశ్విత ఉద్యోగాలు ఇస్తే దానిలో అందులో 60 శాతం అవకాశం బీసీలకే దక్కింది. – ఉద్యోగాలు, పదవులు, పథకాల్లో బీసీలకే అగ్రతాంబూలం వేస్తున్న నాయకుడు వైఎస్ జగన్. – మీరెన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. *జగనన్న పాలనలో బీసీలు బాద్షాలు..!:* – కార్మికుల డబ్బులు ఈఎస్ఐ కుంభకోణం ద్వారా కొట్టేసిన అచ్చెన్నాయుడు కూడా బీసీల గురించి మాట్లాడుతున్నాడు. – బీసీలకు విలువ ఇవ్వని చంద్రబాబును కనీసం ప్రశ్నించే సాహసం చేయలేని మీరు మమ్మల్ని అనడానికి అర్హతే లేదు. – పదవుల కోసం మీరు చంద్రబాబు కాళ్ల కింద చెప్పుల్లా మీరు బతుకుతున్నారు. – ఆనాడు బీసీల తోకలు కత్తిరిస్తాను అన్నప్పుడు ఈ అచ్చెన్నాయుడు లాంటి నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు? – జగనన్న పాలనలో బీసీలు బాద్షాలుగా బతుకుతున్నాం. – 2019 డిసెంబర్లో స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం జగన్మోహన్రెడ్డి గారు జీవో తీసుకొచ్చారు. – ఆ జీవోపై తన తెలుగుదేశం పార్టీ వ్యక్తితో చంద్రబాబు కోర్టులకు వెళ్లి స్టే తీసుకొచ్చి ఆపించిన వ్యక్తి. – మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 33 శాతం రిజర్వేషన్ ఇస్తానని అంటున్నారు..? – బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం జగనన్న ఏకంగా పార్లమెంటులో ప్రైవేటు బిల్లునే ప్రవేశపెట్టిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్. – బీసీలకు 30 పథకాల మాట దెవుడెరుగు..కనీసం 3 పథకాలైనా బీసీలకు ఇచ్చారా? – నిజంగా మీరు 30 పథకాలు ఇచ్చి ఉంటే 2019లో మీరు ప్రజలు కనీసం 30 సీట్లైనా ఇచ్చి ఉండేవారు కదా? – మీరు ప్రతి స్కీమ్‌ని స్కామ్‌గా మార్చి దోచుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటీ చేయలేదు. – మళ్లీ ప్రజలను మభ్యపెట్టడానికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారో అర్ధం కావడం లేదు. – బీసీలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టుకెక్కిన వ్యక్తి చంద్రబాబు. – గతంలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేసి కొత్త హామీలు ఇవ్వాలి. కానీ బాబు ప్రజలంతా మర్చిపోతారన్నట్లు ఫీల్ అవుతున్నాడు. – ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచే తీసేసిన ఘనుడు చంద్రబాబు. – చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసే 2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలు ఇచ్చారు. – అవేవీ నెరవేర్చకుండా మళ్లీ తప్పుడు హామీలతో ఇద్దరూ ప్రజల వద్దకు వస్తున్నారు. – ఆ హామీలు అమలు చేయనందుకు మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి తర్వాత హామీలివ్వండి. – ఇంత మేలు చేసిన జగనన్నకు ప్రజలంతా మళ్లీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. – బీసీలు అత్యంత దారుణంగా అవమానం పాలైంది..అణచివేతకు గురైంది చంద్రబాబు పాలనలోనే.