టీడీపీ అంటే తెలుగు డర్టీ పార్టీ 

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి 

మహిళా లోకం తలదించుకునేలా అనిత మాట్లాడుతోంది

టీడీపీ మహిళా నేతల వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు

వంగలపూడి అనిత వ్యాఖ్యలను ఆమె పిల్లలే హర్షించరు

మహిళల పేరెత్తే అర్హతే టీడీపీ నేతలకు లేదు

సైకో పార్టీకి మహిళా అధ్యక్షురాలు అనిత

మహిళల పుట్టుకనే అవమానించిన సైకో చంద్రబాబు

మహిళా సాధికారతకు నిదర్శనం వైయస్‌ఆర్‌సీ ప్రభుత్వం

విశాఖ: తెలుగు దేశం పార్టీ అంటే తెలుగు డర్టీ పార్టీ, తెలుగు దుశ్సాసనుల పార్టీ, దుర్యోధనుల పార్టీ అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వరుదు కళ్యాణి అభివర్ణించారు. మహిళలను మోసం చేసిన పార్టీ టీడీపీ అని మండిపడ్డారు. మహిళా లోకం తలదించుకునేలా టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మాట్లాడారని విమర్శించారు. వంగలపూడి అనిత భాష అసభ్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిత మాట్లాడే భాషను ఆమె పిల్లలు హర్షించరన్నారు. మహిళల పేరెత్తే అర్హతే టీడీపీకి లేదన్నారు. సైకో పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడని, మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు. మహిళలను అవమానించిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, నారాయణ ఇంటి ముందు అనిత దీక్షలు, ధర్నాలు చేయాలని సూచించారు. విశాఖలో వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.

   వరుదు కళ్యాణి ఏమన్నారంటే...

  మహిళల ఆత్మవంచన దీక్షః
 నిన్న విజయవాడలో టీడీపీ, మిగతా పార్టీల్లో ఉన్న టీడీపీ సానుభూతిపరులు కలిసి మహిళల ఆత్మగౌరవ దీక్ష పేరుతో నోటికొచ్చినట్టు మాట్లాడారు. అది మహిళల ఆత్మగౌరవ దీక్ష కాదు.. మహిళల ఆత్మవంచన దీక్ష. ఎందుకంటే... టీడీపీ మహిళ అధ్యక్షురాలు అనిత ఆ వేదిక మీద ఉంది కాబట్టి అది ఆత్మవంచన దీక్ష. మహిళల్ని నిత్యం తిట్టడం, అవమానించడం, అసత్య ప్రచారాలు చేయడంలో అనిత ఎప్పుడూ ముందుంటుంది. అటువంటి వ్యక్తి ఆ వేదిక మీద ఉన్నందుకు మహిళలు సిగ్గుపడుతున్నారు.

  వైయ‌స్ జగనన్న ప్రతి ఆలోచన, ప్రతి పాలసీ, ప్రతి పథకం... మహిళల కోసమే..
 - ముఖ్యమంత్రి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత ఏ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎక్కడా లేదు... ఎక్కడా చూడలేదు. గౌరవ ముఖ్యమంత్రి జగనన్న ప్రతి ఆలోచన, ప్రతి పాలసీ, ప్రతీ పథకం మహిళ సంక్షేమం కోసం, మహిళా భద్రత కోసం, మహిళా సాధికారత కోసం చేపట్టినవి. నాలుగేళ్ళుగా మహిళా పక్షపాతి పరిపాలనను రాష్ట్రంలో చూస్తున్నాం. 
- టీడీపీ ఆత్మవంచన వేదిక మీద వంగలపూడి అనితతో కలిసి వేరే పార్టీ మహిళలు ఎలా పాల్గొన్నారో అర్థం కావట్లేదు. వంగలపూడి అనిత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ. టీడీపీ మహిళల్ని నిట్టనిలువునా మోసం చేసి,  ముంచిన పార్టీ, మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన పార్టీ టీడీపీ. టీడీపీ అంటే... తెలుగు దుశ్శాసనుల పార్టీ, తెలుగు డర్టీ పార్టీ, తెలుగు ధుర్యోధనుల పార్టీ. 

 వక్రబుద్ధి, వక్ర మాటల అనితః
- టీడీపీ మహిళాధ్యక్షురాలు అనిత మాట్లాడితే... నా పిల్లలు చూస్తే బాధపడరా అంటుంది.. మరి నువ్వు మాట్లాడే భాషా, మాట్లాడే తీరు చూసి మీ పిల్లలు బాధపడరా? ఇద్దరు పిల్లల తల్లి అయిన అనిత.. తల్లి అనే పదాన్ని వక్రీకరించి మాట్లాడటం దారుణం.. శ్రీమతి భారతమ్మ, శ్రీమతి విజయమ్మ అని గౌరవంగా పిలుచుకుంటే... అమ్మ అనే పదాన్ని కూడా వక్రీకరించి, అసహ్యంగా మాట్లాడారే, మీ మాటల్ని చూసి రాష్ట్ర మహిళలందరూ అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు భార్యను భువనమ్మ అని అంటారే.. అందులో ఉన్న అమ్మను కూడా మీ లాజిక్ ప్రకారం వక్రీకరించి మాట్లాడతారా అనితా?
- మీ ప్రెస్ మీట్ లు, మీ స్పీచ్ లు మీ పిల్లలకు చూపించారా? మీ పిల్లలు వాటిని చూస్తే మిమ్మల్ని అసహ్యించుకుంటారు.. మీ పిల్లలే మిమ్మల్ని చెప్పులతో కొడతారు..
- ముఖ్యమంత్రిగారిని అసభ్యపదజాలతో దూషిస్తూ, సీఎంగారి ఇంట్లో మహిళల్ని ఘోరంగా చులకన చేసి మాట్లాడతారా? మహిళ వాలంటీర్లను మీరు, పవన్ కల్యాణ్.. ఎంత చులకన చేసి మాట్లాడారు? అటువంటి మీరా? మహిళ గురించి మాట్లాడేది. మహిళల పేరు ఎత్తే అర్హత కూడా అనితకు, టీడీపీకి లేదు.
- టీచర్ జాబ్ చేశాను, అపర మేధావి అని చెప్పే వంగలపూడి అనిత.. మీ స్టూడెంట్స్ కి ఇదే భాష నేర్పించారా? అదే భాష ఇప్పుడు మాట్లాడుతున్నావా? మీ మాటలు మీకే సిగ్గుగా అనిపించట్లేదా? సైకో పార్టీలో, గత సైకో ప్రభుత్వంలో  మహిళ అధ్యక్షురాలుగా పనిచేసిన అనిత ఇంతకంటే ఏం మాట్లాడుతుంది..?
- మరోసారి భారతమ్మను కానీ, విజయమ్మను కానీ దూషిస్తే రాష్ట్రంలోని మహిళలందరూ బురదలో ముంచిన చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి దొంగ దీక్షలు చేస్తే రానున్న ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.

 మహిళల పాలిట సైకో చంద్రబాబుః
- కోడలు మగబిడ్డను కంటానంటే  అత్త వద్దంటుందా... అంటూ ఆడబిడ్డల పుట్టుకనే అవహేళన చేసిన వ్యక్తి, సైకో చంద్రబాబు. మహిళా ఎమ్మార్వో వనజాక్షిగారిని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈడ్చికెళ్ళి కొడితే... చింతమనేని ప్రభాకర్ ని సపోర్టు చేసి, మహిళా అధికారి వనజాక్షిగారిని అవమానించిన సైకో చంద్రబాబు. ఎమ్మెల్యే ఆర్కే రోజాగారిని ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేసిన మహిళాద్రోహి, ఈ సైకో చంద్రబాబు. పవన్ కల్యాణ్ తల్లిని, ఆయన కుటుంబంలోని ఆడవారిని అవమానించడానికి రూ.10కోట్లు ఖర్చుపెట్టి ట్రోల్స్ చేసిన సైకో చంద్రబాబు... అని పవన్ కల్యాణే ఆరోజు విమర్శించారు. జగనన్న ఇంట్లో మహిళల మీద అసభ్యకరమైన ట్రోల్స్ చేసిన సైకో చంద్రబాబు. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ దందాతో ఎంతోమంది మహిళల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తులకు సపోర్టు చేసిన సైకో చంద్రబాబు. అటువంటి సైకో పార్టీలో ఉన్న మీరా మమ్మల్ని విమర్శించేది?

 బాబు ఇంటి ముందు మీరు దీక్షలు చేయాలిః
- మహిళల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్నారే.. మీరు దీక్షలు చేయాల్సింది చంద్రబాబు ఇంటిముందు.. వాలంటీర్లలో మహిళలు ఎక్కువమంది ఉన్నారని తెలిసి కూడా, వాలంటీర్లు ఇళ్లల్లో తలుపులు కొడుతున్నారు  అని, అక్రమ సంబంధాలు గురించి అడుగుతున్నారని దిగజారి వయసుని కూడా మర్చిపోయి, తన అనుభవాన్ని కూడా మర్చిపోయి మాట్లాడుతున్న చంద్రబాబు ఇంటి ముందు మీరు దీక్షలు చేయండి. దళిత మహిళను బూటి కాలితో తన్నిన మీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇంటి ముందు దీక్ష చేయండి. 22 మంది ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకుంటే.. ఒక్క కేసు కూడా నమోదు కాకుండా చేసిన నారాయణ ఇంటి ముందు దీక్ష చేయండి. మహిళా అధికారిని దూషించి, ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించిన అయ్యన్న పాత్రుడు ఇంటి ముందు దీక్ష చేయండి.  మహిళల గురించి అవమానకరంగా మాట్లాడిన బాలకృష్ణ ఇంటి ముందు దీక్ష చేయండి. 

 మహిళా సాధికారత, సంక్షేమం, భద్రతకే జగనన్న పెద్దపీటః
- మహిళా సాధికారత, మహిళా సంక్షేమం, మహిళల భద్రత కోసం పెద్దపీట వేస్తున్నారు జగనన్న. మహిళా భద్రత కోసం జగనన్న మన రాష్ట్రంలో తీసుకున్న చర్యలు గతంలో ఎన్నడూ చూడలేదు. దిశ చట్టానికి రూపకల్పన చేసి, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ లు, ఫోరెన్సిక్ ల్యాబ్ లు తీసుకురావడమే కాకుండా, ప్రతి గ్రామంలో, వార్డులో మహిళా పోలీసును నియమించి, మహిళల రక్షణకు పెట్రోలింగ్ వాహనాలు తీసుకొచ్చారు. మహిళల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే 10 నిమిషాల్లోపే దిశ వెహికల్ వెళ్లి రక్షించే పరిస్థితి కల్పించారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు 1 కోటి 40లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్ ద్వారా వచ్చిన 25,554 ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. మహిళల కోసం ఇంతలా భద్రతా చర్యలు చేపట్టిన పరిస్థితులు 14ఏళ్ల చంద్రబాబు పాలనలో ఉందా?
-తన 14 ఏళ్ళ పాలనలో మహిళల్ని అడుగడుగునా మోసం చేసిన ద్రోహి చంద్రబాబు అయితే.. కేవలం 4 ఏళ్ల పాలనలోనే మహిళా సంక్షేమ ప్రభుత్వాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి జగన్ గారు. జగనన్న సంక్షేమ, అభివృద్ది పాలనకు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, విమర్శించడానికి ఏమీ లేక దొంగ దీక్షలు చేస్తున్నారు. జగనన్న పాలనలో మహిళలు సంతోషంగా లేరా.? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో మహిళలు సంబరాలు చేసుకున్నారా? 
- రూ.14,200కోట్ల డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేసింది చంద్రబాబు కాదా? . దానికి రూ.3వేల కోట్ల అపరాధ రుసుం మహిళల మీద పడేట్టు చేసింది చంద్రబాబు కాదా? సున్నా వడ్డీ ఇస్తానని మహిళల్ని మోసం చేసింది చంద్రబాబు కాదా? ఆడపిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ లో కోత విధించి చదువుల్లో ఆటంకాలు సృష్టించింది చంద్రబాబు కాదా? 
- జగనన్న 44లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం ఇస్తున్నారు... చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు? 
- జగనన్న 80లక్షల మందికి ఆసరా పథకం ఇస్తున్నారు.. చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు? 
- జగనన్న 31లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు.. చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు? 
- సున్నావడ్డీ పథకాన్ని చంద్రబాబు ఎత్తేస్తే.. సమర్థవంతంగా జగనన్న అమలు చేస్తున్నారు.
-ఆడపిల్లల చదువు కోసం విద్యాదీవెన పథకాన్ని విజయవంతంగా జగనన్న అమలు చేస్తున్నారు. 
- 45-60 ఏళ్ల మధ్య ఉన్న మహిళల కోసం చేయూత పథకాన్ని అందిస్తూ ఎంతో మంది స్వయం ఉపాధికి అండగా జగనన్న నిలబడ్డారు. 
- అధికారంలో ఉన్నంత కాలం ఏమి చేయకుండా.. ఈరోజు చేస్తానంటే చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 
- నాడు చంద్రబాబు ఎన్నికల హామీలను తప్పడమే కాకుండా వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టోను కూడా తీసేశారు. 
- కానీ.. నేడు జగనన్న మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావించి అందులోని అంశాలను 99శాతం నెరవేర్చిన గొప్ప సీఎం జగనన్న. రూ. 2లక్షల26వేల కోట్లను అత్యంత పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావులేకుండా డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు అందించారు.

 క్యారెక్టర్ అసాసినేషన్(వ్యక్తిత్వ హననం) కు ఆద్యుడు కర్త, కర్మ, క్రియ చంద్రబాబు... 
- ఐ-టీడీపీ అనే సోషల్ మీడియా వ్యవస్థను పెట్టి నిత్యం మహిళల మీద ట్రోల్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. సాక్షాత్తూ మీ పార్టీ ఫౌండర్ అయిన ఎన్టీఆర్ మీదే బట్టలు లేకుండా కార్టూన్స్ వేయించి ఘోరంగా అవమానించారు, లక్ష్మీపార్వతి, జూ.ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్ తల్లిగారు, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు, వైఎస్ జగన్ గారు, ఆయన ఫ్యామిలీ మీద ట్రోల్స్ చేయించారు. వాటిని ప్రారంభించింది, ఇప్పటికీ కొనసాగిస్తుంది మీ టీడీపీవారే. మీరే అన్నీ చేస్తూ ఇతరుల మీద ఏడుపులు ఏడుస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మీరు చేసే ట్రోల్స్ కి ఇతరుల పిల్లలు బాధపడరా? వాళ్లింట్లో వారు పిల్లలు కాదా? వాళ్లు మనుషులు కాదా? మీరు చేస్తే మంచి... ఎదుటివారు చేస్తే చెడా? మీరు మాట్లాడేది ఎంతవరకు న్యాయం?

  కాపీ -పేస్ట్ బాబుః
- 14ఏళ్లు సీఎంగా పనిచేశా... 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు సిగ్గులేకుండా మా జగనన్న అమలుచేస్తున్న పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టో ను తయారుచేసుకున్నారు. కాపీ-పేస్ట్ చంద్రబాబు. గ్రామాల్లో ఆర్బీకేలు, సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలు, విలీజ్ క్లీనిక్ ఎక్కడ చూసిన అభివృద్దే కనిపిస్తోంది. కొత్తగా మెడికల్ కాలేజీలు మరో 17 వస్తున్నాయి. పెట్టుబడి నుంచి గిట్టుబాటు వరకు రైతుల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. విత్తనం నుంచి విక్రయం వరకు అడుగడుగునా రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. క్వాలిటీ ల్యాబ్స్ ఏర్పాటు చేసి నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. 
- చంద్రబాబు పాలనలో రుణమాఫీ చేస్తానని ఎగ్గొడితే రైతులు అప్పులుపాలై ఉపాధి కూలీలుగా పట్టణాలకు వలసపోయారు.. కానీ నేడు జగనన్న ఇస్తున్న సపోర్ట్ తో రైతులు మళ్లీ పట్టణాల నుంచి గ్రామాలకు తిరిగొచ్చి దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. నేను రైతునని గర్వంగా చెప్పుకునే స్థాయిని జగనన్న కల్పించారు. జగనన్న అందిస్తున్న గొప్ప పరిపాలన చూసి ఓర్వలేక, విమర్శలు చేయడానికి ఏమీ లేక పిచ్చి దీక్షలు చేస్తున్నారు. 

 పేదరికం తగ్గిందిః
- నీతి ఆయోగ్ మల్టీ డైమన్షీయల్ పవర్టీ ఇండెక్స్ రిపోర్టులో 2015-16 వరకు పేదరికం 11.77 శాతం ఉంటే 2019-21లో 6.01శాతానికి తగ్గింది.. అంటే టీడీపీ ప్రభుత్వం కంటే మా ప్రభుత్వంలో పేదరికం 5.76శాతం తగ్గింది. జగనన్న ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలే ఇందుకు కారణం. అంతేకాకుండా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో సంక్షేమమే కాకుండా ఉపాధి కూడా కల్పించి ప్రజల్ని ఆదుకోవడం వల్ల వారి జీవనప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. -వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదరికం తగ్గి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో జగనన్నను ప్రతి మహిళ ఎంతగానో నమ్ముతున్నారు.. ఎందుకంటే  ప్రతి మహిళను జగనన్న తన సొంత తల్లిలా, చెల్లిలా, బిడ్డలా చూస్తూ వారి రక్షణ కోసం, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. జగనన్న మహిళల కోసం నిలబడ్డారు. రాష్ట్రంలోని మహిళలందరూ జగనన్నకు అండగా నిలబడ్డారు. పార్టీ, కులం, మతం, ప్రాంతాలు చూడకుండా అర్హుడైతే చాలని అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందిస్తున్న గొప్ప సీఎం జగన్ గారు.

 మణిపూర్ ఘటనలు చాలా దారుణం, తీవ్రంగా ఖండిస్తున్నాంః
- మణిపూర్ లో మహిళలపై జరిగిన సంఘటనలు చాలా దారుణం, దురదృష్టకరం. మహిళల్ని వివస్త్రలను చేసి చాలా దారుణంగా వ్యవహరించారు. యావత్తు మహిళా లోకమంతా చాలా బాధపడింది, అటువంటి ఘటనలు ఎక్కడా జరగకూడదు.. మణిపూర్ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. 
- మణిపూర్ లాంటి సంఘటనలు టీడీపీ ప్రభుత్వంలోనే జరిగాయి.. దానికి ఉదాహరణ పెందుర్తి నియోజకవర్గం జెర్రిపోతులపాలెంలో అప్పటి ఎమ్మెల్యే అయిన బండారు సత్యనారాయణ మూర్తి అనుచరులు,  ఎస్టీ మహిళను వివస్త్రను చేసి రోడ్డు మీదనే చావబాదారు.  ఈ ఘటనలను  గుర్తు తెచ్చుకొని బండారు ఇంటి ముందు తెలుగుదేశం మహిళలు దీక్షలు చేయాలి. వాలంటీర్స్ ను పట్టుకుని మనుషులను అక్రమంగా రవాణా చేస్తారని ఘోరంగా అవమానించిన పవన్ కల్యాణ్ ఇంటి ముందు తెలుగుదేశం మహిళలు దీక్ష చేయాలి. ఇప్పటికైనా చంద్రబాబు- మహిళల పాలిట సైకో అని తెలుసుకోండి... అని వరుదు కల్యాణి హితవు చెప్పారు. 

Back to Top