దివ్యాంగుల ధ‌ర్నాకు ఎమ్మెల్యే విరుపాక్షి మ‌ద్ద‌తు

క‌ర్నూలు:  తొల‌గించిన పింఛ‌న్లు పున‌రుద్ధ‌రించాల‌ని కోరుతూ ఆలూరు ప‌ట్ట‌ణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద  దివ్యాంగులు ధర్నా చేప‌ట్టారు. వీరి ఆందోళ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే విరుపాక్షి మ‌ద్ద‌తు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌ పేరిట కూటమి ప్రభుత్వం లక్ష మంది దివ్యాంగుల పెన్షన్లను రద్దు చేసింద‌ని మండిప‌డ్డారు. వారందరికీ సెప్టెంబర్‌ నుంచి పింఛన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు నోటీసులు జారీ చేయ‌డం దుర్మార్గ‌మైన చ‌ర్య అన్నారు.  దివ్యాంగుల పెన్షన్లు కూడా వదలరా.. మీకు మనసెలా వచ్చింది అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు తగ్గించారని విమ‌ర్శించారు. దివ్యాంగులకు పింఛ‌ను వెంటనే పునరుద్ధరణ చేయాలని ఎమ్మెల్యే వీరుపాక్షి డిమాండ్ చేశారు. న్యాయం జరగక పోతే కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు. 

Back to Top