బాబు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నాడు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
 

రాప్తాడు: చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. రాప్తాడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులను జేసీ దివాకర్‌రెడ్డి అవమానిస్తే చంద్రబాబు నవ్వడం ఎంతవరకు సమంసజం అని ప్రశ్నించారు. హింసకు పాల్పడాలని చంద్రబాబు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ పోలీసులను బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్షనేత స్థానంలో ఉండి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. బాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులపై జరిగిన దాడులు కనిపించలేదా అని నిలదీశారు. వైయస్‌ఆర్‌ సీపీ నేతల హత్యలకు బాబు బాధ్యత వహించాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలతో చంద్రబాబు భయపడిపోతున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 

Back to Top