20 ఏళ్లుగా అభివృద్ధి జరగడం లేదు

కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌
 

అసెంబ్లీ: కోడుమూరు నియోజకవర్గంలో వర్గపోరు కారణంగా 20 ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే సుధాకర్‌ పేర్కొన్నారు. మంగళవారం సభలో ఆయన మాట్లాడారు. నన్ను చూడకుండా నాకు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన సీఎం వైయస్‌ జగన్‌కు, నా నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. నా నియోజకవర్గంలో 20 ఏళ్లుగా అభివృద్ధి జరగలేదు. వర్గపోరు వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. ఇంత వరకు ప్రభుత్వ డిగ్రీ, ఐటీఐ కాలేజీ లేదు. మా నియోజకవర్గం చుట్టూ నీరు ఉంటుంది. కానీ ప్రజలకు తాగడానికి నీరు లేదు. మా ప్రభుత్వం వచ్చిన తరువాత వాటర్‌ గ్రీడ్‌ ద్వారా రూ.750 కోట్లు కేటాయించారు. అందరికీ తాగడానికి నీరు ఇస్తున్నారు.

Back to Top