ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ప్ర‌మాణం

అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా శ్రీశైలం నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో ఎథిక్స్ క‌మిటీ చైర్మ‌న్‌గా శిల్పా చక్రపాణి రెడ్డి, కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్ రావు, మేక వెంకట ప్రతాప్ అప్పారావు, సత్తి సూర్యనారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

Back to Top