శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

    
 తిరుమల : వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర విజ‌య‌వంతం కావ‌డంతో గురువారం ఎమ్మెల్యే రోజా తిరుమ‌ల‌లో శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా పూర్తిచేసుకున్న వైయ‌స్‌ జగన్‌ నేడు స్వామివారి దర్శనం కోసం తిరుమల వస్తున్నారని తెలిపారు.

పాద‌యాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ఇచ్ఛాపురంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కానీ, అక్కడ జనమే లేరని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి అంటున్నారు. ఆయన గనుక నిన్నటి సభకు వచ్చి ఉంటే జనాలు తొక్కి నలిపేసేవారని రోజా వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, చంద్రబాబు పాలనను ఎండగట్టడానికి మరో ప్రస్థానంలా ప్రజా సంకల్ప పాదయాత్ర సాగిందని అన్నారు.  
 

Back to Top