వైయస్‌ జగన్ సుపరిపాలన చూసి నారా వారి నరాలు చిట్లిపోతున్నాయి

ఐటీ సోదాలను డైవర్ట్‌ చేయడానికి ప్రజా చైతన్య యాత్ర  

ఎమ్మెల్యే ఆర్కే రోజా

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సుపరిపాలన చూసి నారా వారి నరాలు చిట్లిపోతున్నాయని ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేపట్టింది ప్రజా చైతన్య యాత్ర కాదని..పిచ్చోడి యాత్ర అని అభివర్ణించారు.  గురువారం రోజు మీడియాతో మాట్లాడారు. 'ఎవరిది ఉన్మాద పరిపాలనో ప్రజలు ఎన్నికల్లో చెప్పారు. 23 సీట్లు మాత్రమే ఇచ్చి చంద్రబాబును మూలన కూర్చోబెట్టారు.  జగన్ సుపరిపాలన చూసి నారా వారి నరాలు చిట్లిపోతున్నాయి. ఏ అవసరం ఉందని ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నారు? ఇది ప్రజా చైతన్య యాత్ర? ప్రజలు చీకొట్టిన పిచ్చోడి యాత్ర?' అని వ్యాఖ్యానించారు.

'దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గొప్ప ఆలోచనలతో వైయస్‌ జగన్‌ పథకాలు అమలు చేస్తున్నారు. తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు తీరు ఉంది. మద్యం పాలసీపై చంద్రబాబు నాయుడు తాగుడు బోతుల సంఘానికి అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారు. తాగుబోతులకు మద్దతుగా ఆయన మాట్లాడుతున్నారు. జగన్‌పై బురద ఎలా చల్లాలనే విషయంపై భూతద్దాలతో వెతుకుతున్నారు' అని విమర్శించారు.

జీవితాంతం జైల్లో ఉంటారు..
చంద్రబాబు, లోకేశ్‌ తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారని రోజా అన్నారు. 'ఐటీ సోదాలను డైవర్ట్‌ చేయడానికి ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. వారు జీవితాంతం జైల్లో ఉంటారు. ప్రకాశం జిల్లాలో మైనింగ్‌ అక్రమాలో మొత్తం టీడీపీ నేతలే ఉన్నారు. కచ్చితంగా వీరు చేసిన తప్పులకి జైలుకు వెళ్లే అవకాశం ఉంది' అని చెప్పారు.

Back to Top