సంక్షేమ పాల‌న‌తో ప్ర‌తి గుడిసె...గుండెలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ఎమ్మెల్యే రాజ‌న్న దొర‌
 

 
అమ‌రావ‌తి: స‌ంక్షేమ పాల‌న‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్తి గుడిసె, ప్ర‌తి గుండెలో గూడు క‌ట్టుకున్నార‌ని ఎమ్మెల్యే రాజ‌న్న‌దొర పేర్కొన్నారు. ఇది ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం..పేద‌ల ప్ర‌భుత్వం. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిపాల‌న స్వ‌ర్ణ యుగాన్ని త‌ల‌పిస్తోంది. గిరిజ‌న ఎమ్మెల్యే అయిన తాను స‌భ‌లో మాట్లాడుతుంటే టీడీపీ స‌భ్యులు అడ్డుప‌డుతున్నారు.స‌భ ఆర్డ‌ర్‌లో లేక‌పోతే మేం మాట్లాడితే ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలియ‌వు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యాను. రెండుసార్లు వైయ‌స్ఆర్‌, రెండుసార్లు వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌కు ఎమ్మెల్యేగా అవ‌కాశం ఇచ్చారు. అలాంటి గిరిజ‌న సీనియ‌ర్ ఎమ్మెల్యేను మాట్లాడుతుంటే అడ్డుప‌డ‌టం స‌రికాదు. 14 ఏళ్లు సీఎంగా ప‌ని చేసిన చంద్ర‌బాబు తీరు ఎలా ఉందో ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాలి.  వైయ‌స్ జ‌గ‌న్ 3648 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. గుప్తుల కాలంలో స్వ‌ర్ణ యుగం ఉండేది. ఈ రోజు సంక్షేమ ప‌థ‌కాల‌తో స్వ‌ర్ణ‌యుగంలా మార్చారు. మా పార్టీ మేనిఫెస్టో జ‌నం అజెండా..దాన్ని వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌లు కులాలు, మ‌తాల‌తో సంబంధం లేకుండా అర్హ‌త ఒక్క‌టే చూస్తూ సంక్షేమ ప‌థ‌కాలు అంద‌జేస్తోంది. 18 ప‌థ‌కాల ద్వారా నేరుగా న‌గ‌దు బ‌దిలీ చేస్తున్నారు. ఏడాదిన్న‌ర వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో అవినీతి మ‌ర‌క లేదు. అవినీతిర‌హిత‌, పార‌ద‌ర్శ‌క పాల‌న సాగుతోంది. నేరుగా ప్ర‌జ‌ల‌కు సంక్షేమం అందుతోంది. గతంలో ఎప్పుడూ చూడ‌ని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పాల‌న సాగుతోంది. గుడిసెలు, గుండెల్లో చూసినా కూడా వైయ‌స్ జ‌గ‌న్ నిండుకున్నారు. అన్ని వ‌ర్గాల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మేలు చేస్తున్నారు. 18 ప‌థ‌కాల ద్వారా నేరుగా ల‌బ్ధిదారులకు న‌గ‌దు అందుతోంది. రూ.67 వేల కోట్ల న‌గ‌దు నేరుగా ప్ర‌జ‌ల‌కు అందింది. గ‌తంలో చంద్ర‌బాబు ఇచ్చింది రూ.44 వేల కోట్లు మాత్ర‌మే ఐదేళ్ల‌లో డీపీటీ ఖర్చు చేశారు. ఇంత‌క‌న్న స‌మ‌ర్ధ‌వంత‌మైన పాల‌న ఎవ‌రూ ఇవ్వ‌లేరు. వైయ‌స్ జ‌గ‌న్ 18 నెల‌ల్లోనే 68 వేల కోట్లు ఖ‌ర్చు చేశారు. ప్ర‌జ‌లు ఇవ‌న్నీ కూడా గ‌మ‌నించాలని ఎమ్మెల్యే రాజ‌న్న దొర కోరారు. 

Back to Top