చంద్రబాబు ఆటలు ఇక సాగవు  

ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి
 

గుంటూరు: రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధికి మూడు రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్ని రకాలుగా ఆలోచించారని ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే సంక్షేమ పథకాలు తెచ్చారని తెలిపారు. చంద్రబాబులా స్వలాభం, స్వార్థ ప్రయోజనాలు వైయస్‌ జగన్‌కు ఉండవన్నారు. అమరావతిలో ప్రజలను రెచ్చగొట్టి చంద్రబాబు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. 
 

Back to Top