స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదు

విధ్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తి చంద్రబాబు

చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు

సీఎం వైయస్‌ జగన్‌ పనితీరుతో బాబు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది

టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదని చంద్రబాబే అంటారు

టీడీపీ నేతలను బెదిరించాల్సిన అవసరం మాకేంటి?

ఈడీ, సీబీఐలను రాష్ట్రానికి రానివ్వలేదు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి

తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ఓటమి కళ్లముందు కనిపించడంతో చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను పక్కదారి పట్టించడం, విధ్వేషాలు రెచ్చగొట్టడం చంద్రబాబు నైజమని ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ ప్రజారంజక పాలనకు ఆకర్శితులై టీడీపీకి చెందిన నాయకులు వైయస్ఆర్‌సీపీలో చేరుతున్నారని, టీడీపీకి స్థానిక సంస్థల్లో అభ్యర్థులు లేరన్నారు. రాజ్యసభకు ఇద్దరు బీసీలను ఎంపిక చేసిన గొప్ప వ్యక్తి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు. 
అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి, ప్రజల్లో భావోద్వేగాలు, కులతత్వాలు రెచ్చగొట్టి లబ్ధి పొందే వ్యక్తి చంద్రబాబు. పది నెలల క్రితం చంద్రబాబు ఏం మాట్లాడో తెలుసు. మోదీతో జతకట్టి నాలుగేళ్లు ఏం సాధించాడో చెప్పుకోలేడు కానీ..మోదీతో పోట్లాడుతున్నాను అని చెప్పుకోవడానికి తాపత్రయ పడ్డారు. నిప్పు అని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ఈ రాష్ట్రంలోకి ఈడీ, సీబీఐ రావడానికి వీల్లేదంటూ చట్టాలు చేశాడు. జీవోలు ఇచ్చాడు. తాను చేసిన పాపాలను కప్పిపుచ్చుకుని, తనకు శిక్ష పడుతుందన్న సందర్భంలో ప్రజలే రక్షించుకోవాలని తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేక, వాళ్ల క్యాడర్‌ అంతా ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు చేసిన  అన్యాయాన్ని గుర్తించిన టీడీపీ నాయకులు ఇవాళ పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు. వైయస్‌ఆర్‌సీపీ నేతలు దాడులు చేస్తున్నారు. నామినేషన్లు వేయకుండా చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలతో రేపు జరుగబోయే పరాభావానికి ఈ రోజు గ్రౌండ్‌ ఫిపెర్‌ చేసుకుంటున్నారు.  నాయకులు దొరకడం లేదని భావించి పోటీకి కొత్త తరం నాయకులు రావాలని చంద్రబాబు పిలుపునివ్వడం సిగ్గు చేటు. ఇంకొకపక్క వైయస్‌ఆర్‌సీపీ నాయకులు బెదిరిస్తున్నారని అంటున్నాడు. మీరు పోటీకి ముందుకు రాకపోతే మేం బెదిరించినట్లా? కార్యకర్తలను ఉత్పత్తి చేసే కార్మాగారం అని చెప్పుకున్న చంద్రబాబు..ఇవాళ ఆ కార్మాగారం తుప్పుపట్టిందా అని ప్రశ్నించారు.
రాజధాని విషయం, బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను ఏవిధంగా మభ్యపెట్టారో చూశాం. నిన్నటి వరకు బలహీన వర్గాలకు వైయస్‌ఆర్‌సీపీ అన్యాయం చేసిందని అన్నారు. రిజర్వేషన్లు కోల్పోయిందని చెప్పారు. టీడీపీ ఐదేళ్ల పరిపాలనలో 59 శాతం రిజర్వేషన్లు కొనసాగించేందుకు సర్వే నిర్వహించకుండా, బలహీన వర్గాలను అణగదొక్కాలనే రాజకీయ కక్షతో చేశారు. ఇవాళ రాజ్యసభ సీట్లలో రెండు సీట్లు బలహీన వర్గాలకు ఇచ్చారంటే బీసీలపై సీఎం వైయస్‌ జగన్‌కు ఎంత ప్రేమో గమనించండి. చంద్రబాబు ఏనాడైనా బలహీన వర్గాలకు ఇలాంటి అవకాశం ఇచ్చారా? ఎల్లోమీడియాను వాడుకుని టీడీపీని ఇన్నాళ్లు బతికించుకున్నారు. వాస్తవంగా టీడీపీ ఎప్పుడో చచ్చిపోయింది. వైయస్‌ జగన్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై టీడీపీలో ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్‌, రహిమాన్‌, కదిరి బాబూరావు, పులివెందుల సతీష్‌రెడ్డి తదితరులు వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారు. లోకేష్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాదు. నాలుగేళ్ల తరువాత ఆయన ప్రభుత్వం వస్తుందట. అధికారులను బదిలీ చేస్తారట. రాష్ట్రం ఆయన జాగీరా? చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డిని ఎదుర్కొలేని చేతకాని నాయకుడు చంద్రబాబు. అన్ని విషయాల్లోనూ చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ గెలుపుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తలందరూ కూడా ఉత్సహంగా పని చేయాలి. వైయస్‌ జగన్‌ సైనికులు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. వైయస్‌ జగన్‌ పరిపాలన కొత్త రిఫామ్స్‌ అని పక్క రాష్ట్రాలు కొనియాడుతున్నాయని పార్థసారధి పేర్కొన్నారు.  

Back to Top