చంద్రబాబు బీసీల ద్రోహి

బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారు

బలహీన వర్గాలకు సీఎం వైయస్‌ జగన్‌ అండగా నిలిచారు

రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లింది చంద్రబాబు అనుచరుడే

బీసీ రిజర్వేషన్లకు చంద్రబాబు మెకాలడ్డారు

రాబోయే రోజుల్లో బీసీ ఎకనామిక్‌పై సర్వే చేయిస్తాం

బీసీ అంటే చంద్రబాబు దృష్టిలో బిలినీయర్‌ క్లాస్‌ 

వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే పార్థసారధి

తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు బీసీ ద్రోహి అని వైయస్‌ఆర్‌సీపీ అధకార ప్రతినిధి కొలుసు పార్థసారధి విమర్శించారు. ఐదేళ్లలో చంద్రబాబు బీసీలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లింది చంద్రబాబు మనిషే అన్నారు. వచ్చే ఐదేళ్లలో బీసీ ఎకనామిక్‌పై సర్వే నిర్వహించి 59 శాతం రిజర్వేషన్లు కల్పించేలా సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు. 
బలహీన వర్గాలకు ఏదైనా మేలు జరిగిందంటే అది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాం, వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే..ఈ విషయంలో బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాలు విసిరారు. చంద్రబాబు ఏ రోజు కూడా బీసీల గురించి ఆలోచించలేదు, అరకొర ఆదరణ పథకాలు, సబ్సిడీలు ఇచ్చే కార్యక్రమాలు తప్ప..వారిని విద్యావంతులను చేయాలనే ఆలోచన చంద్రబాబు ఏ రోజు చేయలేదు.  ఈ రోజు టీడీపీ ఎన్ని కుట్రలు పన్నుతోంది. పరుగెత్తి వెళ్లి సుప్రీం కోర్టులో కేసులు వేస్తున్నారు. ఈ రోజు తీర్పుకు కారణం చంద్రబాబు ఉసిగొల్పిన బిర్రు ప్రతాప్‌రెడ్డి కాదా? నీ పాలనలో ప్రతాప్‌రెడ్డికి పదవి ఇచ్చింది వాస్తవం కాదా? ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ ప్రతాప్‌రెడ్డిని వెంట పెట్టుకొని రాష్ట్రమంతా తిరిగింది వాస్తవం కాదా? రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో కేసు వేసిన బిర్రు ప్రతాప్‌రెడ్డిని ఎందుకు ఆపలేకపోయావని ప్రశ్నిస్తున్నాను. ఎన్నికలు నిర్వహిస్తే దాదాపు 4 వేల కోట్లు కేంద్రం నుంచి వస్తాయి..ఇప్పటికే రాష్ట్రాన్ని దివాళ తీయించానని చంద్రబాబు అనుకుంటున్నారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుకునేందుకు ప్రతాప్‌రెడ్డితో సుప్రీం కోర్టులో కేసు వేయించారు. ఈ రోజు బలహీన వర్గాలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారు. వైయస్‌ జగన్‌ను బీసీ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు తాపత్రయ పడుతున్నారు. ఈ ఏడు మాసాల్లో బలహీన వర్గాలకు మేలు జరిగిందో లేదో ఆలోచన చేయండి. బలహీన వర్గాల సమస్యలు వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక వాటిని పరిష్కరించేందుకు శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రయత్నం ఎప్పుడైనా చంద్రబాబు చేశారా? నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు చట్టం తీసుకువచ్చిన ఘనత వైయస్ జగన్‌ది కాదా? కరోనా వైరస్‌ లాగా ఎల్లో వైరస్‌తో జనాలను అగణదొక్కావే తప్ప.. ఏ రోజు కూడా వారికి మేలు చేయాలని ఆలోచన చేయలేదు. ఐదేళ్లు సీఎంగా ఉండి చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఎస్టీ, మైనారిటీలకు మంత్రి పదవి  ఇవ్వని నీలాంటి సీఎం ఎవరూ లేరు. ఈ రోజు వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక..తన మంత్రి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి  ఇవ్వడమే కాకుండా ప్రధానమైన పోర్ట్‌ఫోలియోలు ఇచ్చారు. ఇలాంటి ప్రయత్నం ఏ రోజైనా చంద్రబాబు చేశారా?. 60 శాతం మంత్రి పదవులు ఈ రోజు బీసీ, ఎస్సీ వర్గాలకు దక్కాయి. చంద్రబాబు ఐదేళ్లలో ఎందుకు ఎకనమిక్‌ సర్వే చేయించలేదో సమాధానం చెప్పాలి. మా సీఎం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. రాబోయే ఐదేళ్లలో బీసీల ఎకనమిక్‌పై సర్వే చేసి కోర్టు ఉద్దేశాల ప్రకారం మళ్లీ 59 శాతం రిజర్వేషన్లు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. మా ప్రభుత్వం దాదాపు 54 వేల కుటుంబాలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే..డెమో గ్రాఫ్‌ ఇన్‌ బ్యాలెన్స్‌ వస్తుందని చంద్రబాబు వాదించారు. అంటే అమరావతిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉండకూడదా? చంద్రబాబు బీసీ ద్రోహి, ఆయన ఎక్కడా కూడా బీసీలకు మేలు చేయలేదు. ఈ రోజు అమ్మ ఒడి, రైతు భరోసా, పింఛన్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మేలు జరుగుతుంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో బీసీ విద్యార్థులకు, నిరుద్యోగులకు మేలు చేసే ఆలోచన చేశారా? మేం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు ఉద్దేశంలో బీసీ అంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు..బిలీనియర్‌ క్లాస్, బాబు క్లాస్  అన్నట్లుగా చేశారే తప్ప..వారిని ఆదుకోవాలని ఎప్పుడు ఆలోచన చేయలేదు. బలహీన వర్గాలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న కార్యక్రమాల వల్ల కోటిశ్వరులకు మేలు జరుగకపోయి ఉండవచ్చు. కానీ పేద వర్గాలకు మాత్రం వారి జీవితాలపై భరోసా కల్పించారు. ఉగాదికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం. ఇందులో దాదాపు 85 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు. ఎల్లో వైరస్‌ కారణంగా బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు  వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే పార్థసారధి పేర్కొన్నారు. 

Back to Top