ఆత్మకూరు వచ్చి ఏం చేస్తావు బాబూ

పల్నాడులో టీడీపీ ఖాళీ, జెండా కట్టే నాయకుడు కూడా లేడు

ఆ భయంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున

గుంటూరు: పల్నాడులో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుందని, టీడీపీ జెండా కట్టే నాయకుడు కూడా లేడని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు బురదజల్లుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున అన్నారు. గుంటూరులోని హోటల్‌ తాజ్‌ ఓల్డ్‌ విజయ కృష్ణలో పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎంపీలు లావు కృష్ణ దేవరాయలు, నందిగామ సురేష్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, బొల్ల బ్రహ్మనాయుడు, మేరుగు నాగార్జున సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. ఉట్టికి ఎక్కనోడు స్వర్గానికి ఎక్కినట్లు చంద్రబాబు పరిస్థితి ఉంది. చాలా కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు పల్నాడులో ఏ గొడవ జరగలేదు. ఈ వంద రోజుల్లోనే మొత్తం కుదేలైపోయినట్లుగా చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పల్నాడులో టీడీపీ ఖాళీ అయిపోతుంది. టీడీపీ జెండా కట్టే నాయకుడు కూడా లేడు. ఉన్న నాయకులు కేసుల్లో ఇరుక్కొని ఎప్పుడు అరెస్టు అవుతారనే పరిస్థితి. టీడీపీ జాతీయ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు పార్టీని రక్షించుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. 

సీఎం వైయస్‌ జగన్‌ వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉందని ప్రజలందరికీ తెలుసని, ప్రజల నుంచి హర్షాతిరేఖాలు కూడా వ్యక్తం అవుతున్నాయని మేరుగు నాగార్జున అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా పాలన జరుగుతుంది. చంద్రబాబు ఆత్మకూరు వచ్చి ఏం చేస్తారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులం కూడా వస్తున్నాం. పల్నాడు ప్రాంతంలో వీధి వీధి తిప్పుతాం. చంద్రబాబూ ఇంకా ఎంతకాలం మసిబూసి మారేడు కాయ చేస్తావు. ప్రజలు కళ్లు లేనివారు కాదు. రాష్ట్రంలో వైయస్‌ జగన్‌ అనే ధ్రువతార ముఖ్యమంత్రిగా రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తున్నారన్నారు. చేతనైతే పెయిడ్‌ ఆర్టిస్టులు, టీడీపీ దొంగలతో డ్రామాలు ఆపించాలని చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు పాలనలో దళితులు వెలివేతలకు గురయ్యారు. చివరకు ఓట్లు కూడా వేయనివ్వని పరిస్థితి. ప్రస్తుతం ప్రజలంతా ధైర్యంగా ఉన్నారు. పల్నాడు ప్రాంతం నుంచి చిన్న ఇసుక రేణువును కూడా మార్చి నీ పార్టీలోకి తీసుకెళ్లలేవు చంద్రబాబూ అని మేరుగు నాగార్జున హెచ్చరించారు. 
 

Back to Top