విజయవాడ :సీఎం వైయస్ జగన్ ఈ రాష్ట్రంలో హౌస్ ఫర్ ఆల్ అనే నినాదంతో ముందుకు వెళ్లతున్నారని వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే తమప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విజయవాడ నగరంలోని రాజీవ్ నగర్, కండ్రిక ప్రాంతాల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు చంద్రబాబు నాయుడుని చిత్తుగా ఓడించినా బుద్ధి రాలేదని, బాబు పరిపాలనలో అమరావతి, పోలవరం నాశనం చేశాడని ఆరోపించారు. చంద్రబాబు 40 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకోవడమే కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని మల్లాది విష్ణు అన్నారు. ఇల్లు ఇవ్వకుండా బాబు అడ్డు.. డిసెంబర్ 25 నాటికి 30 లక్షల మందికి ఇళ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మల్లాది విష్ణు వెల్లడించారు. పేదలకు ఇల్లు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నాడని పేర్కొన్నారు. గతంలొ టీడీపీ నేతలు పేద ప్రజల వద్ద నుంచి ఇల్లు ఇస్తామని రూ.25 ,50 వేలు వసూలు చేశారని ధ్వజమెత్తారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 400 కోట్లతో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టామని, రాబోయే స్థానిక నగర పాలక సంస్థ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని మల్లాది విష్ణు విశ్వాసం వ్యక్తం చేశారు.