అమరావతి: ఎన్టీఆర్ చనిపోవడానికి చంద్రబాబు కారణం కాదా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాస్ అన్నారు. అధికారం లేనప్పుడు మాత్రమే బాబుకు ఎన్టీఆర్ గుర్తొస్తారని మండిపడ్డారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ప్రజా సమస్యలపై టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. సభను అడ్డుకోవడానికే టీడీపీ సభ్యులు వస్తున్నారని విమర్శించారు.
ఎన్టీఆర్ పై జగన్ కు అమితమైన గౌరవం ఉంది. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ఆలోచన చేయలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేశారు.
టీడీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.కోనసీమ జిల్లాకు డా.బి.ఆర్. అంబేద్కర్ పేరు పెడితే గొడవలు సృష్టించారు. కుప్పం ప్రజల జీవన విధానంలో మార్పులొచ్చాయి. ఎన్నడూ కనీవినీ ఎరుగనంతగా సంక్షేమం అందడంతో ప్రజలు మాకు అండగా నిలిచారు. కుట్రలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. వైఎస్ జగన్ కు ప్రజల్లో ఆదరణ రావడం తట్టుకోలేక చంద్రబాబు ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉంటాడు. మరో విప్ కరణం ధర్మశ్రీ సభలో టీడీపీ నేతలు రోజుకో విన్యాసం చేస్తున్నారని విమర్శించారు. అరణ్యవాసంలో ఉండి అజ్ఞాతవాసం చేస్తున్నా టీడీపీ నేతల్లో మార్పు రావడం లేదు. ఎన్టీఆర్ పై అపారమైన ప్రేమ ఉన్నట్లు టీడీపీ నేతలు నటిస్తున్నారు. మనుషుల్ని వాడుకోవడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు.