దేవినేని ఉమా కాదు..సొల్లు ఉమా

ఎమ్మెల్యే జోగి రమేష్‌

విజయవాడ: టీడీపీ నేత దేవినేని ఉమా తీరును వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఎండగట్టారు. చంద్రబాబు, దేవినేని ఉమా డ్రామా ఆర్టిస్టులని మండిపడ్డారు. దేవినేని ఉమా కాదు..ఆయన ఓ సొల్లు ఉమా అని ఎద్దేవా చేశారు. మైలవరంలో మొత్తం దోచుకున్నది ఉమానే అని విమర్శించారు. దేవినేని ఉమా మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి, గ్రావెల్‌ దోచుకున్నారని తెలిపారు. దేవినేని ఉమాపై ఎటువంటి దాడి జరగలేదని జోగి రమేష్‌ స్పష్టం చేశారు. దేవినేని ఉమాతో ఉన్న గూండాలే దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top