ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ 

విశాఖ: ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం పెద్దలింగాలవలస గ్రామంలో గాలిదేవర చెరువులో చేపడుతున్న ఉపాధి హామీ పనులను  ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ప‌రిశీలించారు. ఇందులో భాగంగా వేతన దారుల నుంచి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు పూట్లు పనిచేస్తే  గిట్టుబాటు వేతనాలు తీసుకోగలరు అన్నారు. పనిచేసిన ప్రదేశంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ దృష్టికి వేతనదారులు తీసుకువచ్చారు. దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడి మౌలిక సదుపాయాలతో పాటు, తాగునీరు, నీడ కల్పించాలని అధికారులుకు ఆదేశించారు.
  కార్యక్రమంలో లావేరు మండలం ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జడ్పీటీసీ మీసాల సీతంనాయుడు, జే.సి.యస్ ఇంచార్జ్ మీసాల శ్రీనువాసరావు, వైస్ ఎంపీపీ లుకలాపు శ్రీనువాసరావు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లుకలాపు అనిల్ కుమార్, లుకలాపు సుధీర్, కలిశెట్టి భాస్కరరావు, బొబ్బాది శ్రీను, బొబ్బాది ఈశ్వరరావు, లుకలాపు చిన్న శ్రీను, పిసిణి ఉపేంద్ర, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top