నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం

అనూష కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

గుంటూరు: ప్రేమోన్మాది చేతిలో హతమైన అనూష కుటుంబ సభ్యులను వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. నిందితుడికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబీకులకు హామీ ఇచ్చారు. విద్యార్థిని అనూష హత్య దారుణమని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అనూష కుటుంబానికి సీఎం వైయస్‌ జగన్‌ రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇప్పించమని అధికారులను ఆదేశించారన్నారు. దిశ యాక్ట్‌ ద్వారా నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు.

దిశా చట్టం ద్వారా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితునికి కఠిన శిక్ష పడేలా సంబందిత అధికారులకు ఆదేశాలు జారిచేయటం జరిగిందన్నారు. నియోజకవర్గనికి సంబంధం లేని విషయాన్ని కూడా కొంతమంది నాయకులు రాజకీయం కోసం వాడుకుంటూ ఇక్కడ ఈ సంఘటనలో రాజకీయం చేయటం దురదృష్టకరమ‌న్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరపున తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇస్తున్నామ‌న్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top