విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పి 23 సీట్లకు పరిమితం చేసినా చంద్రబాబు మైండ్ సెంట్ ఇంకా మారలేదని, ప్రపంచంలో నాకంటే మేధావి ఎవరూ లేరన్నట్లుగా మాట్లాడుతున్నాడని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. బిల్‌గేట్స్ నుంచి పీవీ సింధు వరకు తానే మ్యానిఫ్యాక్చర్ చేసినట్లుగా చంద్రబాబు వైఖరి ఉందన్నారు. చంద్రబాబు, ఆయన ఏజెంట్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీరిద్దరు కలిసి కుట్ర చేసి ఎన్నికలు ఆపారని మండిపడ్డారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు అడ్డుకోవాలని దుర్బుద్ధితో కుట్ర చేశాడని మండిపడ్డారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని హేళన చేస్తూ చంద్రబాబు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. అసలు కరోనా వైరస్ గురించి చంద్రబాబుకు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే ముఖ్యమంత్రి మూడుసార్లు రివ్యూ చేశారు. చంద్రబాబు మాటల తీరు చూస్తుంటే కేవలం తన అనుచరుడు నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న చర్యను సమర్థించడానికి ముఖ్యమంత్రిని హేళన చేసి మాట్లాడుతున్నాడు. కరోనా వైరస్ 2002లోనే సార్స్ అనే ఒక వైరస్ చైనాలో ప్రారంభమైంది. ఈ వైరస్ సోకిన వారు దాదాపు 100 మందిలో 12 మంది చనిపోయారు. 2012లో గల్ఫ్ దేశాల్లో దాదాపు 100 మందికి 32 మంది చనిపోయే విధంగా మార్స్ అండ్ మెర్స్ అనే వైరస్ సోకింది. ఇప్పుడు చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ చూస్తే కేవలం వంద మందిలో 3 శాతం మంది చనిపోయే అవకాశం ఉంది. వంద మందిలో 81 శాతం మంది క్యూర్ అవుతున్నారు. మిగిలిన 19 శాతంలో 14 శాతం మందికి మాత్రమే జలుబు, దగ్గు వస్తున్నాయని, వీటికి పారాసిట్మాల్ టాబ్లేట్ ద్వారా క్యూర్ అవుతుంది. మిగిలిన 5 శాతం వారికి ఊపిరితిత్తులకు జబ్బు వచ్చి వెంటిలేటర్ సపోర్టు, యాంటీబయాటిక్స్ అవసరం అవుతాయి. వీరికి మాత్రమే ఆస్పత్రిలో చికిత్స అవసరం. కరోనా వైరస్‌కు 95 శాతం పారాసిట్మాల్ వాడుతున్నారు. ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. చంద్రబాబు ముందు దీనిపై అవగాహన చేసుకోవాలి. అది తెలియకుండా హేళన చేయడం సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంది. కరోనాను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం సమష్టి కృషితో చర్యలు తీసుకుంటుంది. రూ.5 వేల కోట్లు అనవసరంగా పోగొట్టుకుంటున్నామని పది రోజుల్లో ఎన్నికలు ముగించే సమయంలో ఎన్నికలు వాయిదా వేయడం వల్ల అభ్యర్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నిధులు అడ్డుకొని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను ఇబ్బందలు పెట్టాలని చంద్రబాబు కుట్ర చేశాడు. అమెరికాలో మొదటి వారంలో కరోనా వైరస్‌కు సంబంధించి కేవలం రెండు కేసులు, రెండో వారంలో 105 కేసులు, మూడో వారంలో 613 కేసులు నమోదైతే.. ఇండియా ఇప్పటి వరకు 114 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మూడో వారంలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఫ్రాన్స్‌లో మొదటి వారంలో 12, మూడవ వారంలో 653 కేసులు, ఇరాన్ మూడో వారానికి 4747 కేసులు, ఇటలీలో 1536 కేసులు, ఇండియాలో కేవలం 114 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీని గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేరళ ముఖ్యమంత్రి, తెలంగాణ కూడా పారాసిట్మాల్‌తో తగ్గుముఖం అని మాట్లాడారు. చంద్రబాబు ఇంకా మేధావి అని ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటే వ్యాధిని నియంత్రించవచ్చు. గోవాలో మార్చి 22వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతున్నారు. అలాంటిది మన రాష్ట్రంలో నడపడానికి ఎందుకంత బాధ అని ప్రశ్నించారు.