అసెంబ్లీ: దళితులపై చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉందో కౌన్సిల్‌లో తిరస్కరించిన పంపిన ఎస్సీ కమిషన్ విభజన బిల్లు నిదర్శనమని ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. కౌన్సిల్‌లో మెజార్టీ ఉందని చంద్రబాబు ఎస్సీ కమిషన్ విభజన బిల్లును తిరస్కరింపజేశారన్నారు. అసెంబ్లీలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన ఎస్సీ కమిషన్ విభజన బిల్లును శాసనసభలో ఆమోదించి కౌన్సిల్‌కు పంపిస్తే కౌన్సిల్‌లో అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీలను ఆదుకొని వారి జీవన శైలిలో మార్పు తీసుకురావాలని సీఎం వైయస్ జగన్ ఎస్సీ కమిషన్ విభజన బిల్లు మళ్లీ తీసుకువస్తే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. ఇది చాలా బాధాకరం. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు మాట్లాడారు. దళితుల పట్ల టీడీపీకి ఎలాంటి ఉద్దేశం ఉందో చంద్రబాబు మాటలు నిదర్శనం. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పుట్టిన గ్రామంలో, నియోజకవర్గంలో ఒక దళితుడితో స్వేచ్ఛగా ఓటు వేయించారా..? చంద్రబాబు సమాధానం చెప్పాలని సూటి ప్రశ్న వేస్తున్నా..