వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల పార్టీ.. కష్టంలో ఉద్భవించిన పార్టీ

 ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి
 

గుంటూరు: వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల పార్టీ.. కష్టంలో ఉద్భవించిన పార్టీ అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి అన్నారు. పేదింట్లో పుట్టిన ప్రతిభావంతుడిని ఉన్నత చదువులు చదివించాలన్నేది సీఎం వైయ‌స్ జగన్‌ ఆశయమని అన్నారు. రైతును రాజు చేసే దిశగా సీఎం వైయ‌స్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారని తెలిపారు. ‘పేద విద్యార్థులను  సొంత అన్నలా చదివిస్తున్న నాయకుడు సీఎం జగన్‌. పిల్లలకు మంచి చదువులు చదివించాలన్న ఆలోచనతో విద్యాదీవెన, అమ్మ ఒడి, వసతి దీవెన అందిస్తున్నాడు.

ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి. కానీ మన పార్టీ పదవుల కోసం, ఆస్తుల కోసం పుట్టింది కాదు.. తండ్రి ఆశయం కోసం పుట్టింది. ఇది కార్యకర్తల పార్టీ. కష్టంలో ఉద్భవించిన పార్టీ. తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజలకు అందించాలనుకున్న మంచి పాలనను సీఎం జగన్‌ తీసుకొచ్చారు’ అని అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top