టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే భూమన

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి చైర్మన్‌గా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తిరుమల కొండపై క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్న అనంత‌రం గరుడాళ్వార్‌ సన్నిధిలో టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. రంగ‌నాయ‌క మండ‌పంలో భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డికి అర్చ‌కులు వేద ఆశీర్వ‌చ‌నం అంద‌జేశారు. టీటీడీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. గతంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి పనిచేశారు. తనను టీటీడీ ఛైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Back to Top