మహానాడు కాదు.. మాయ నాడు...

 ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టికరణ.

 మ్యానిఫెస్టోనే కనుమరుగు చేసిన ఘనుడు చంద్రబాబు... 
 
మాయనాడు వేడుకగా మోసపూరిత హామీలు...

 వైయ‌స్ జ‌గ‌న్ సారథ్యం విప్లవాత్మక మార్పులు... 

 అవినీతికి తావు లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకే నగదు జమ...

 చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రూ. 650 కోట్లతో అభివృద్ధి... 

  సూపర్ స్పెషాలిటీ లో మెరుగైన వైద్యసేవలు... 

 ప్రజల సహకారంతోనే ఇంతటి అభివృద్ధి...

అనంతపురం  : తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా మరోమారు ప్రజలను మోసపూరిత హామీలతో మాయ చేస్తున్నారని, వాళ్ళు చేస్తున్నది మహానాడు కాదు.. మాయలనాడు  అని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కేక్ కటింగ్, వైయస్సార్ విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి గా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుండి నేటి వరుకు రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ లతో ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకురావడమే కాకుండా ఎలాంటి అవినీతి కి తావు లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకే నగదును జమ చేస్తున్నారన్నారు. గత టిడిపి ప్రభుత్వం లో జన్మభూమి కమిటీలతో దోపిడీ చేసారని విమర్శించారు. ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ప్రజా సంక్షేమం తో పాటు విద్య,వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో, ఆస్పత్రుల్లో కార్పొరేట్ కు దీటుగా అభివృద్ధి చేసారని చెప్పారు. ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ప్రత్యేక చొరవతో అనంతపురం జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషలిటీ ఆస్పత్రిలో ఇప్పటికే మౌనిక సదుపాయాలు కల్పించడమే కాకుండా ప్రత్యేకంగా కార్పొరేటర్ తరహా చికిత్స అందించేందుకు మూడు స్పెషలైజేషన్ లు ఏర్పాటు చేసారని తెలిపారు. అనంతపురం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కేవలం రోడ్లు, డ్రైనేజ్ లకే రూ. 650 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని స్పష్టం చేసారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం సలీమ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్, ఆహుడా చైర్మన్ మహాలక్షి శ్రీనివాస్, నాట్యమండలి చైర్మన్ హరిత, ఏడిసీసీ చైర్మన్ లిఖిత, వైయస్సార్ సీపీ రీజనల్ అధ్యక్షుడు రమేష్ గౌడ్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎగ్గుల శ్రీనివాసులు, మదన్ మోహన్ రెడ్డి, కొర్రపాడు హుసేన్ పీరా, రిలాక్స్ నాగరాజు, శ్రీదేవి,జిల్లా వర్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు కాఘజ్ గర్ రిజ్వాన్,పలు కార్పొరేషన్ డైరెక్టర్లు గౌస్ బేగ్, శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి,నగర అధ్యక్షుడు చింత సోమశేఖర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి,జేసీఎస్ కన్వీనర్ లు ఆలుమూరు శ్రీనివాస్ రెడ్డి, చింతకుంట మధు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు,పలువురు కార్పొరేటర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top