ఉలుకెందుకు చంద్ర‌బాబూ?

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు

ఎవ‌రి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవ‌స‌రం ఈ ప్ర‌భుత్వానికి లేదు

న్యాయ వ్య‌వ‌స్థ‌పై నిఘా పెట్టాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్న లేదు

ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లుతున్న బాబు

ప‌చ్చ మీడియాను అడ్డుపెట్టుకొని చంద్ర‌బాబు డ్రామాలు

టీడీపీ కార్యాల‌యాల్లో జెండాలు ఎగుర‌వేయ‌లేని దౌర్భాగ్య‌మైన స్థితిలో తండ్రి, కొడుకులు

టీడీపీ రోజు రోజుకు ప్ర‌జాధ‌ర‌ణ కోల్పోతుంది

ప్ర‌జ‌ల్లో అద్భుత‌మైన స్పంద‌న క‌లిగిన ప్ర‌భుత్వం మాది

కుట్ర‌లు చేసి ప్ర‌భుత్వానికి వ్య‌వ‌స్థ‌ల‌ను దూరం చేసే కుట్ర‌

మీడియాలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త సృష్టించ‌డం ఎవ‌రికి సాధ్యం కాదు

తాడేప‌ల్లి: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు అన‌వ‌స‌రంగా ఉలిక్కిప‌డుతున్నార‌ని, సంఘ విద్రోహ‌శ‌క్తుల‌తో ఏవైనా కార్యాక‌లాపాలు మొద‌లు పెట్టారా? అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. ఏదోవిధంగా అహింస‌ను పెంపొందింప‌జేసి ఈ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని అస్థిర ప‌ర‌చాల‌ని నేరానికి పాల్ప‌డాల‌ని రాజ‌నేరానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారా అని నిల‌దీశారు. గతంలో చేసిన నేరాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయా అని ప్ర‌శ్నించారు. అధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్ల‌డం స‌రికాద‌న్నారు. ఎవ‌రి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవ‌స‌రం మా ప్ర‌భుత్వానికి లేద‌న్నారు.  సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు చౌక‌బాబు రాజ‌కీయాలు

ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీని చంద్ర‌బాబు హేళ‌న‌గా మాట్లాడారు. నీ క‌న్నా నేను సీనియ‌ర్‌ను అని, దేశానికి నీవు ప్ర‌ధాని కావ‌డంవ‌ల్ల దేశం అదోగ‌తిపాలైంద‌ని, లేనిపోని మాట‌లు మాట్లాడారు. మోదీ నాయ‌క‌త్వాన్ని గురించి చంద్ర‌బాబు అన‌రాని మాట‌లు అన్నారు. అలాంటి చంద్ర‌బాబు మోదీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. చంద్ర‌బాబు చౌక‌బారు రాజ‌కీయాలు చేస్తున్నారు. గతంలో బాబు అధికారంలో ఉన్న‌ప్ప‌డు సీబీఐ రాష్ట్రానికి రాకూడ‌ద‌ని అడ్డుకున్నారు. ఈడీ రావ‌ద్ద‌న్నారు. కేంద్ర సంస్థ‌లు అన్ని మోస‌మ‌న్నారు. అవ‌న్నీ కూడా మోదీ చేతిలో కీలు బొమ్మ‌ల‌న్నారు. ఈ సంస్థ‌ల‌న్నిటిపై ఎప్పుడు చంద్ర‌బాబుకు న‌మ్మ‌కం క‌లిగిందో   స‌మాధానం చెప్పాలి.

ఒక్క ఆధారమైనా చూపించ‌గ‌ల‌రా?..

 ఈ ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు అనేక ఆరోప‌ణ‌లు చేశారు. సంస్థ‌ల‌పై టార్గెట్ చేస్తుంద‌ని, ఫోన్ ట్యాపింగ్ చేస్తుంద‌ని ఆరోప‌ణ‌లు చేశారు.  ప్ర‌జాస్వామ్యంలో మూడో స్తంభంగా ఉన్న జ్యూడిషియ‌ల్‌ను, ప్ర‌తిప‌క్ష నేత‌ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంద‌ని మాట్లాడారు. వీటిపై ఒక్క ఆధార‌మైన చూపించ‌గ‌ల‌రా? ఈ ప్ర‌భుత్వంపై ఆధారాలు లేకుండా బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో ప‌ది మ‌ర్డ‌ర్స్ చే
శారు. లోకేష్ రేపులు చేశార‌ని దారిన పోయేవారు ఆరోపిస్తే..ఒప్పుకుంటారా? ఆధారాలు లేకుండా ఓ ప‌త్రిక‌లో వార్త‌లు రాయిస్తారు. మ‌రో టీవీ చాన‌ల్‌లో దానిపై మొరిగిస్తారు. అన్యాయం జ‌రిగిపోయింద‌ని మ‌ళ్లీ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తారు. ప్ర‌జాస్వామ్య‌దేశంలో ఎల్లోమీడియాతో త‌ప్పుడు క‌థ‌నాలు సృష్టించి, దానిపై కోర్టుల్లో పిల్ వేయిస్తారు. ఆ పిల్‌ను కోర్టులో విచార‌ణ జ‌రిపిస్తారు. ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేసి ఈ ప్ర‌భుత్వాన్ని దెబ్బ‌కొట్టాల‌ని చంద్ర‌బాబు కుట్ర‌లు చేస్తున్నారు. ఎవ‌రి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవ‌స‌రం ఈ ప్ర‌భుత్వానికి లేదు. చ‌ట్ట‌వ్య‌తిరేక కార్యాక‌లాపాల‌కు పాల్ప‌డాల్సిన అవ‌స‌రం ఈ ప్ర‌భుత్వానికి లేదు. న్యాయ‌వాదులు, సోష‌ల్ యాక్టివిటిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అఘాయిత్యం ఈ ప్ర‌భుత్వానికి లేదు. ఏదైనా ఉంటే చ‌ట్ట‌బ‌ద్ధంగానే చేస్తాం. 

ఏదో ఒక పిచ్చి పేప‌రు రాస్తే..

సంఘ విద్రోహ శ‌క్తులు, ఈ రాష్ట్రంలో ఏదైనా అహింస‌కు పాల్ప‌డే రౌడీల ఫోన్లు ట్యాపింగ్ చేస్తాం. నిషేధిత సంస్థ‌లను ట్యాపింగ్ చేస్తాం. ఈ ప్ర‌భుత్వాన్ని అస్థిర ప‌ర‌చాల‌ని చూస్తే అలాంటి వారిపై నిఘా పెడ‌తాం. వారి ర‌హ‌స్య కార్యాక‌లాపాలు చేస్తాం. చ‌ట్ట‌వ్య‌తిరేకంగా ఎవ‌రు ప్ర‌వ‌ర్తించినా ఊరుకునే ప‌రిస్థితి లేదు. న్యాయ వ్య‌వ‌స్థ‌పై నిఘా పెట్టాల్సిన అవ‌స‌రం ఈ ప్ర‌భుత్వానికి అస‌లే లేదు. ఏదో ఒక పిచ్చి పేప‌ర్‌లో రాయించి బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తారు. దానిపై రాద్ధాంతం చేయ‌డం స‌మంజ‌సం కాదు. 

ఆ ధైర్యం చంద్ర‌బాబుకు లేదు..

ప్ర‌తిప‌క్ష నేత‌ల ఫోన్లు ట్యాప్ చేసి మేం ఏం సాధిస్తాం. 23 సీట్లు ఉన్న టీడీపీని టార్గెట్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. రోజు రోజుకు ప్ర‌తిప‌క్ష పార్టీ దిగ‌జారి పోతోంది. 74వ స్వాతంత్ర్య దినోత్సం సంద‌ర్భంగా అంద‌రూ రాష్ట్రంలోని పార్టీ కార్యాల‌యాల్లో జెండాలు ఎగుర‌వేస్తుంటే..చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ రాష్ట్రంలో జెండాలు ఎగుర‌వేసే ధైర్యం లేదు. హైద‌రాబాద్‌లో మీ ఇల్లు దాటి ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో కూడా జెండా ఎగుర‌వేసే ధైర్యం టీడీపీ నేత‌ల‌కు లేదు. మీ పార్టీ రోజు రోజుకు కుచించుకుపోతున్న రాజ‌కీయ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోకివ‌చ్చాక ,ఆయ‌న ప్రారంభించిన సంక్షేమ ప‌థ‌కాలు అద్భుతంగా ప్ర‌జ‌ల‌కు చేరుతున్నాయి. ప్ర‌జ‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఈ ప్ర‌భుత్వాన్ని ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో ఇక గెల‌వ‌లేరు. ఆ ధైర్యం చంద్ర‌బాబుకు లేదు. కుట్ర‌లు చేస్తూ..ఆ వ్య‌వ‌స్థ‌ను, ఈ వ్య‌వ‌స్థ‌ను దూరం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సోష‌ల్ యాక్టివిస్టుల‌ను, ప‌త్రిక‌ల‌ను దూరం చేయాల‌ని చేయాల‌ని కుట్ర‌లు చేస్తున్నారు.

మ‌నీ లాండ‌రింగ్ కేసు బ‌య‌టకు వ‌స్తుంద‌ని బాబుకు భ‌యం..

చంద్ర‌బాబుకు ఉలుకెందుకో..ఏదైన సంఘ విద్రోహ శ‌క్తుల‌తో క‌లిసి కార్యాక‌లాపాలు మొద‌లు పెట్టారా? ఏదో ఒక ఘ‌ట‌నకు పాల్ప‌డి రాష్ట్రంలో అల‌జ‌డులు సృష్టించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారా?  లేదా గ‌తంలో పాల్ప‌డిన మ‌నీ ల్యాండ‌రింగ్ బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని భ‌య‌మా? ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు. మీ పోన్లు ట్యాపింగ్‌కు పాల్ప‌డాల్సిన అవ‌స‌రం మా ప్ర‌భుత్వానికి లేదు. ఏదో విధంగా ప్ర‌భుత్వాన్ని అస్థిర ప‌ర‌చాల‌ని, బుర‌ద జ‌ల్లాల‌ని చూడ‌టం స‌రికాదు. మీ వ‌ద్ద ఏదైనా ఆధారం ఉంటే చూపించండి. ఆంధ్ర‌జ్యోతి క‌థ ఇంకో ప్రెస్‌మీట్లో చెబుతా. ఏదో గుడ్డ కాల్చి మొహ‌న వేస్తే స‌రిపోదు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మంచి కార్య‌క్ర‌మాలు ప్రారంభిస్తుంటే..

 ప్ర‌జ‌ల్లో బ‌లం లేని మీరు మీడియా బ‌లం ఉంద‌ని ఏదో ఒక‌టి బుర‌ద జ‌ల్లితే ప్ర‌జ‌లు అన్ని గ‌మ‌నిస్తున్నారు. ఇలాంటివి సాధ్యం కావు. ఎన్నిక‌ల్లో ఇవ‌న్నీ గ‌మ‌నించిన ప్ర‌జ‌లు మీకు గుణ‌పాఠం చెప్పారు. మీడియాతో రాష్ట్రాన్ని ప‌రిపాలించాల‌నుకోవ‌డం, ప్ర‌జావ్య‌తిరేకత‌ను సృష్టించాల‌నుకోవ‌డం, లేనిపోనివి చెప్ప‌డం మంచిది కాదు. ఇవాళ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అనేక‌మైన మంచి కార్య‌క్ర‌మాలు ప్రారంభిస్తుంటే..మీ ప‌త్రిక‌ల్లో ఏదో ఒక‌టి రాస్తూ ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చాల‌ని చూస్తున్నారు. మీరు సంఘ విద్రోహ‌శ‌క్తుల‌తో కలిసిపోయారా?, రాష్ట్రంలో అశాంతిని సృష్టించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారా?  ప్ర‌భుత్వాన్ని అస్థిర ప‌ర‌చాల‌ని చూస్తే అది సాధ్యం కాద‌ని అంబ‌టి రాంబాబు హెచ్చ‌రించారు.  ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు ఇలాంటి ఆరోప‌ణ‌లు మానుకొని వాస్త‌వాల‌కు ద‌గ్గ‌ర‌గా మాట్లాడాల‌ని అంబ‌టి రాంబాబు సూచించారు. 

 

Back to Top