అట్ట‌హాసంగా జ‌గ‌నన్న స్వ‌రోత్స‌వ సాంస్కృతిక వేడుక‌లు

ఉత్స‌వాల‌ను ప్రారంభించిన మంత్రులు ఆర్కే రోజా, నారాయ‌ణ‌స్వామి

తిరుపతి: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి వారితో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు అట్ట‌హాసంగా ప్రారంభ‌మ‌య్యాయి.  తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక వేడుకలను మంత్రులు ఆర్కే రోజా, నారాయ‌ణ‌స్వామి, వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ప్రారంభించారు. సంబరాల్లో భాగంగా క్రీడల పోటీలను జోనల్, రాష్ట్ర స్థాయిల్లో నిర్వ‌హిస్తున్నారు. తిరుపతి జోన్‌ కళాకారులకు మహతి కళాక్షేత్రంలో నవంబర్‌ 19, 20, 21 తేదీల్లో, గుంటూరు జోన్‌ వారికి 24, 25, 26 తేదీల్లో శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో, రాజమండ్రి జోన్‌ వారికి 29, 30, డిసెంబర్‌ 1 తేదీల్లో శ్రీవేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో పోటీలు నిర్వహిస్తామని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. విశాఖ జోన్‌ వారికి డిసెంబర్‌ 7,8,9 తేదీల్లో ఉడా చిల్డ్రన్స్‌ థియేటర్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్‌ 19, 20 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తామని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమం అందిస్తున్న నేత సీఎం వైయ‌స్‌ జగన్‌ అని మంత్రి రోజా కొనియాడారు. జగనన్న సంక్షేమ సామ్రాట్‌ అని రోజా ప్రశంసించారు. స్వ‌ర్ణోత్స‌వాల్లో భాగంగా కూచిపూడి, ఆంధ్ర నాట్యం, భరత నాట్యం, జానపద కళారూపాలు తదితర కళా రంగాల్లో జోనల్, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తామని, ప్రతి విభాగంలో జోనల్‌ స్థాయి విజేతల గ్రూప్‌నకు రూ.25 వేలు, సోలో కి రూ.10 వేలు, రాష్ట్ర స్థాయి విజేతలకు గ్రూప్‌నకు రూ.లక్ష, సోలోకి రూ.50 వేలను సీఎం జన్మదినం రోజున అందజేస్తామని మంత్రి రోజా తెలిపారు.    

 రాయలసీమ పులిబిడ్డ, సంక్షేమ సామ్రాట్ సీఎం వైయస్ జగన్ అన్న..  చంద్రబాబు రాయలసీమ ద్రోహి  అని అభివర్ణించారు.  తాను , తన బినామీలు  చల్లగా ఉంటే చాలు, ప్రజలు ఏమైనా ఫర్వాలేదు అనుకునే వ్యక్తి చంద్రబాబు.   చంద్రబాబు ఎందుకు ఫ్రస్టేట్ అవుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎంత ఫ్రస్టేట్ అయినా.. 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు అన్నది తథ్యమన్నారు.  చంద్రబాబు పాలనలో ఏ ఒక్క కొత్త పథకం తీసుకు రాలేదు. ప్రజలు ఏ మేలూ చేయలేదు. ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు. రాయలసీమ లో పుట్టిన చంద్రబాబు.. పిచ్చివాడిలా అరుస్తుంటే మాకు బాధగా  ఉంది,  ఇక, రాజకీయాలు వదిలేసి, మనవడుతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తే మంచిదని మంత్రి రోజా అన్నారు.

Back to Top