కొండవీడును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

గుంటూరు: కొండవీడును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వపరంగా కృషిచేస్తామని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కొండవీడులో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రారంభించారు. కొండవీడు రెడ్డి రాజుల గత వైభవాన్ని గుర్తు చేసేలా శ్రీశైలం అఖిలభారత రెడ్డి సమాఖ్య ఆధ్వర్యంలో మ్యూజియాన్ని ఏర్పాటు చేసిన సభ్యులను వారు అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, విడదల రజని, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top