125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ తయారీని పరిశీలించిన మంత్రులు

హర్యానా: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భుజాన వేసుకొని నడుస్తున్నారని మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, కొట్టు సత్యనారాయణ అన్నారు. హర్యానాలోని మనేసర్‌లో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ తయారీ పనులను  మంత్రుల బృందం పరిశీలించింది. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సీఎం వైయస్‌ జగన్‌ తలపించారన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని మంత్రుల బృందం తెలిపింది. 
 

తాజా వీడియోలు

Back to Top