ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్ర ప్రజలందరికీ సంజీవిని

 మంత్రి విడుదల రజిని
 

అమ‌రావ‌తి: ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్ర ప్రజలందరికీ సంజీవిని అని  మంత్రి విడుదల రజిని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సేవలు అందుబాటులోకి తెచ్చామ‌ని చెప్పారు. విద్య, వైద్య రంగాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింద‌ని మంత్రి విమ‌ర్శించారు. సీఎం వైయ‌స్ జగన్‌ విద్య, వైద్య రంగాలకే ప్రాధాన్యతనిచ్చార‌ని తెలిపారు.  పేదవారికి ఉపయోగపడేలా సంస్కరణలు తీసుకొచ్చార‌ని వివ‌రించారు. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు పెంచడం ఎంతోమందికి లబ్ది జరిగింద‌న్నారు. రోజుకు సగటున 5 వేలకు పైగా పేషెంట్ల‌కు ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయ‌ని వెల్ల‌డించారు. విద్యా, వైద్య రంగాలకు సీఎం వైయ‌స్ జగన్‌ పెద్దపీట వేశార‌ని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు పెంచడం ఎంతో మందికి లబ్ధి క‌లుగుతుంద‌ని చెప్పారు. పేదవారికి ఉపయోగపడేలా సంస్కరణలు తీసుకొచ్చార‌ని గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి కొనియాడారు.

Back to Top