రేపు దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం వైయ‌స్‌ జగన్‌

మధ్యాహ్నం 3 గంటలకు పట్టువస్త్రాలు సమర్పణ

 విజయవాడ: అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం దుర్గమ్మను దర్శించికుని.. మధ్యాహ్నం 3 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదివారం 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం మూలా నక్షత్రం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు పక్కాగా చేశాం. దీనికి భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top