గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పనితీరు అద్భుతం 

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో మంత్రి వెల్లంపల్లి పర్యటించారు. కరోనా నియంత్రణపై అధికారులు తీసుకున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి ఇంటి వద్దకే రూ.1000 పంపిణీ చేస్తున్నామని తెలిపారు.  గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోంది కొనియాడారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి సూచించారు. ప్రభుత్వ అధికారులకు ప్రజలు సహకరించాలి కోరారు. కరోనా వైరస్‌ మహమ్మారితో ప్రజలు, ప్రభుత్వం పోరాడుతుంటే.. రాష్ట్రం నుంచి పారిపోయి హైదరాబాద్‌లో తలదాచుకున్న చంద్రబాబు, పవన్‌ మాత్రం ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అనవసరపు విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top