తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు వేడుకలను బెంగళూరులో ఐటీ విభాగం ఆధ్వర్యంలో వైయస్ఆర్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు అత్యంత ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. పక్క రాష్ట్రంలో ఉన్నప్పటికీ వైయస్ జగన్ అన్నపై తమ అభిమానాన్ని, అనుబంధాన్ని చాటుకుంటూ ఈ వేడుకలు ఒక పండుగ వాతావరణంలో సాగాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పటిలాగే సేవా మార్గాన్నే ఎంచుకుంటూ, ప్రజల మధ్య నిలిచిన పార్టీగా ముందుకు సాగుతోంది. అదే స్ఫూర్తితో, వైయస్ఆర్‌సీపీ అధినేత, జననేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని బెంగళూరు నగరంలో ఈ ఏడాది కూడా ఐటీ వింగ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల ద్వారా ఘనంగా నిర్వహించారు. ప్రజలతో మమేకమై, మానవతా విలువలను చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలు, అవసరమైన వారికి ఉపయోగపడే విధంగా అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు, జననేత జగన్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఈ వేడుకలు ఒక కుటుంబ వాతావరణంలో, స్నేహపూర్వకంగా సాగాయి.