అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రాష్ట్రంలోని ప్రతి పేదవారికి రక్షగా ఉంటుందని మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. శనివారం గరుడాపురం, ఎనుములదొడ్డి గ్రామాలలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట ప్రతి గడప గడపకు ప్రభుత్వ వైద్య సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. ఇవాళ కళ్యాణదుర్గం మండల పరిధిలోని గరుడాపురం గ్రామం, కుందుర్పి మండల పరిధిలోని ఎనుములదొడ్డి గ్రామంలో హెల్త్ శిబిరాలు ప్రారంభించి వైద్య పరీక్షలు, చికిత్సలు అందించారన్నారు. అనంతరం మంత్రి వైద్యులతో కలసి ప్రజలతో మమేకమై ప్రజల ఆరోగ్య పరిస్ధితులపై అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి, వైయస్ఆర్ కంటి వెలుగు క్రింద ఉచితంగా కళ్ళజోడును పంపిణీ చేసి ఆరోగ్య సురక్ష బుక్ లెట్లను పంపిణీ చేశారు.