మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వం ఇది

 మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణ‌యాలు దేశానికే ఆద‌ర్శం

అసూయ,  ఈర్ష్య‌తో ప్రతిపక్షాలు కుట్రలు, కుతంత్రాలు

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌హిళా ప‌క్ష‌పాతి అని మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వ‌నిత  అన్నారు.  ఇది పేదల ప్రభుత్వం, బడుగు, బలహీనవర్గాల ప్రభుత్వం. మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు... ఇలా సమాజంలో వెనకబాటుకు గురైన ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం అహరహం శ్రమిస్తున్న ప్రభుత్వమ‌ని ఉద్ఘాటించారు.  మహిళా పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్‌.జగన్‌ మోహన్‌రెడ్డిగారు తీసుకున్న నిర్ణయాలు ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. 
వారి జీవన ప్రమాణాలు పెంచడానికి, ఆర్థికంగా వారికి తోడుగా నిలవడానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు... చరిత్రాత్మకమ‌న్నారు. అలాంటి ప్రభుత్వం మీద అసూయతో, ఈర్ష్య‌, తట్టుకోలేక ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు, విష ప్రచారాలు.. ఇవన్నీ కూడా మనం చూస్తున్నామ‌న్నారు.ఈ మేర‌కు మంగ‌ళ‌వారం మంత్రి వ‌నిత ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

 తెలుగుదేశం పార్టీలోని జాతి మనషులు, ఎర్ర పార్టీల్లోని అదే జాతి మనుషులతో కుమ్మక్కై, కలిసిపోయి.. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిని అదే జాతికి చెందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లు భుజాన వేసుకుంటున్నాయి. రెచ్చగొట్టే కార్యక్రమాలను ఒక ఉత్సవంలా చేస్తున్నాయి.  గతంలో అంగన్‌వాడీలపై గుర్రాలతో తొక్కించిన చరిత్రను మాత్రం ఈ పచ్చమీడియా చెరిపేసే ప్రయత్నం చేస్తోంది.
 అంగన్‌వాడీల కోసం, ఆశావర్కర్ల కోసం గత ప్రభుత్వం ఏం చేసింది.. ఈ ప్రభుత్వం ఏం చేసిందో... ఒక్కసారి ప్రజల ముందు పెడుతున్నాం. 

‘ఆశా’లకు: 
 టీడీపీ హయాంలో ఆశాలకు ఇచ్చిన జీతం కేవలం రూ.3 వేలు మాత్రమే. ఎన్నికలకు 5 నెలల ముందు వరకూ ఇదే జీతం ఇచ్చారు. తమ జీతాలు పెంచమని ఎన్నిసార్లు ఆందోళన చేసినా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు జీతాలు పెంచుతామని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భరోసా ఇచ్చాక, అధికారంలోకి వైయస్సార్‌సీపీ రానుందని ఈ రాష్ట్ర ప్రజలు స్పష్టమైన సంకేతం ఇచ్చాక ఎన్నికలకు 5 నెలల ముందు రూ.6 వేలకు చంద్రబాబు తప్పక పెంచాల్సి వచ్చింది. 
 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత కేవలం 3 నెలల్లోనే ఆశాల జీతాలను రూ.10 వేలకు పెంచిన మాట వాస్తవం కాదా?

అంగన్‌వాడీ వర్కర్లకు:
అంగన్‌వాడీ వర్కర్లకు ఎన్నికలకు 6 నెలల ముందుకు వరకూ ఉన్న జీతం రూ.7 వేలు మాత్రమే. దాన్ని రూ.11,500కు ఈ ప్రభుత్వం పెంచిన మాట వాస్తవం కాదా?
 2013 నుంచి అంగన్‌వాడీలకు ప్రమోషన్లు ఇవ్వలేదు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుగారు.. దీన్ని ఎందుకు పట్టించుకోలేదు. ఆనాడు ఈ పచ్చ పత్రికలు, మీడియా ఎందుకు ప్రశ్నించలేదు...? తమను పట్టించుకోలేదన్న విషయాన్ని ఆ మహిళలు నిలదీస్తే ఎప్పుడైనా ప్రసారం చేశారా? మీ జాతి పత్రికల్లో వేశారా?
 రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ప్రమోషన్లతో ఈ ప్రభుత్వం వరం ఇవ్వనుంది. 
 560 గ్రేడ్‌–2 సూపర్‌ వైజర్‌ పోస్టులను భర్తీ చేస్తోంది. 
 వచ్చే నెలలో నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. 
 ఈ సందర్భంగా అంగన్‌వాడీలు చేస్తున్న మరొక డిమాండ్‌ను కూడా ఈప్రభుత్వం తీర్చింది. ఈ సూపర్‌వైజర్‌ పోస్టులకు పరీక్షలు రాసే వయో పరిమితిని 45 ఏళ్లనుంచి 50 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. 9 ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వయోపరిమితి పెంపు చాలా ఉపయోగపడుతుంది. తద్వారా ఎక్కువ మంది పోటీ పడే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.
 అలాగే వారి కార్యక్రమాలను, విధులను సజావుగా నిర్వహించడానికి, మంచి సేవలను అందించడానికి కూడా ఈ ప్రభుత్వం టెక్నాలజీని బాగా వినియోగించుకుంటోంది.
 దీని కోసం వారికి స్మార్ట్‌ఫోన్లు కూడా ఇస్తోంది. 56,984 స్మార్ట్‌ ఫోన్ల కొనుగోలుకు రూ.85.47 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ రెండు నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 
 అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా మంచి వసతులు, సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 

అంగన్‌వాడీ హెల్పర్లకు:
 అంగన్‌వాడీ హెల్పర్లకు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ ఉన్న జీతం రూ.4500 మాత్రమే. 
 దాన్ని ఈ ప్రభుత్వం రూ.7వేలకు పెంచలేదా? 

దేశంలోనే ఏపీ బెస్ట్‌:
 ఆశాల జీతాల చెల్లింపులో దేశంలోనే మన రాష్ట్రం నంబర్‌ వన్‌. అత్యధికంగా జీతాలు ఇస్తోంది. 
 అంగన్‌వాడీ హెల్పర్ల జీతాల విషయంలో కూడా రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌.
 అంగన్‌వాడీ వర్కర్లకు చెల్లిస్తున్న జీతాల్లో దేశంలోని టాప్‌ 5 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. 

 ఇలాంటి ప్రభుత్వం మీద ప్రతిష్టను దిగజార్చడానికి తెలుగుదేశంలోని జాతి మనుషులు, ఎర్ర పార్టీల్లోని స్వజాతి మనుషులతో కుమ్మక్కై రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారు.  వీరి లక్ష్యం మహిళల అభ్యున్నతి కాదు. తొందరగా చంద్రబాబును గద్దె మీద కూర్చోబెట్టాలనే అంటూ మంత్ర తానేటి వ‌నిత పేర్కొన్నారు.
 

Back to Top