వృద్ధులకు మనవడిలా సీఎం వైయస్‌ జగన్‌ భరోసా

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

విజయవాడ: ప్రతి విషయంలో వృద్ధులకు మనవడిలా సీఎం వైయస్‌ జగన్‌ వారికి భరోసా ఇస్తున్నారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటివనిత అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ను ప్రజా సంకల్పయాత్రలో ఎంతోమంది వృద్ధులను కలిశారన్నారు. మంగళవారం ఎంవీకే భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమానికి మంత్రి తానేటి వనిత,  ఎమ్మెల్యే మల్లాది విష్ణులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం, వారి చట్టాలను వివరిస్తూ రూపొందించిన బ్రోచర్, పోస్టర్‌లను మంత్రి వనిత విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..  సీఎం వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక వృద్ధుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పెన్షన్‌ డబ్బులను పెంచారన్నారు. విడతల వారీగా రూ.3 వేల వరకు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘వైయస్‌ఆర్‌ కంటి వెలుగు’ కార్యక్రమం వృద్ధులకు ఉపయోగపడుతుందని తెలిపారు. వృద్ధుల కోసం ‘స్టేట్‌ కౌన్సిల్‌’ ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అక్టోబర్‌ 1న అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించుకోవడం శుభపరిణామం అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వయసు మీద పడిన వృద్ధులను అందరూ గౌరవించాలని సూచించారు.
 

Back to Top