విజయవాడ: పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యుల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. మార్చి 31 వనుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మార్చి 31 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1, ఏప్రిల్ 1వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2, ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్ పేపర్, ఏప్రిల్ 4న ఇంగ్లిష్ పేపర్ –1, ఏప్రిల్ 6న ఇంగ్లిష్ పేపర్–2, ఏప్రిల్ 7న మ్యాథమెటిక్స్ పేపర్–1, ఏప్రిల్ 8న మ్యాథమెటిక్స్ పేపర్ –2, ఏప్రిల్ 9న జనరల్ సైన్స్ పేపర్–1, ఏప్రిల్ 11న జనరల్ సైన్స్ పేపర్–2, ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్ పేపర్–1, ఏప్రిల్ 15వ తేదీ సోషల్ స్టడీస్ పేపర్–2, ఏప్రిల్ 16వ తేదీన ఓఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2, ఏప్రిల్ 17న ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్స్ థియరీ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సురేష్ వివరించారు.