ఐటీ నోటీసులపై చంద్రబాబు, లోకేష్, పవన్ ఎందుకు స్పందించడం లేదు

మంత్రి ఆర్కే రోజా

తిరుప‌తి: ఐటీ నోటీసులపై చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ ఎందుకు స్పందించడం లేద‌ని మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. ఇవాళ తిరుమలలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు.  లోకేష్ పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో మోరుగుతున్నాడు.. పవన్ కల్యాణ్‌ షూటింగ్ గ్యాప్ లో చంద్రబాబు ఫ్యాకేజిని తీసుకోని విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు.  అమరావతిలో అక్రమాలకు పాల్పడిన డబ్బులను బ్రహ్మిణి, భువనేశ్వరి లెక్కల్లో పెట్టారు.. చంద్రబాబు, లోకేష్ ని విచారించి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ కొత్త పాలకమండలిపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. కేసులు పెట్టగానే నేరచరిత్రులు కారు.. వారిని పాలకమండలిలో నియమిస్తే టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి మండిపడ్డారు. రజనీకాంత్ ఎవరినో ఉద్దేశించి చేసిన వాఖ్యలను మాకు అపాదిస్తూ సోషయల్ మీడియాలో ట్రోల్ చేస్తూన్నారని మంత్రి రోజా ఖండించారు.

Back to Top