టీడీపీ వాళ్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. పళ్లు రాలతాయ్‌..

అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద‌ మంత్రి ఆర్కే రోజా

 కొడాలి నాని, అంబటి రాంబాబు ఇళ్ల మీదకు వస్తారా..?

 కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుకను కూడా టీడీపీ వాళ్లు పీకలేరు

 భార్య, తల్లితో.. తండ్రిపై ఒత్తిడి తెచ్చి దొడ్డిదారిన లోకేశ్‌ ఎమ్మెల్సీ, మంత్రి అయ్యాడు

 కేవలం గ్రాఫిక్స్ చూపించారు కాబట్టే అమరావతిలోనూ వైయస్‌ఆర్‌సీపీ గెలిచింది

 మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలా? అమరావతి కావాలో ప్రజల్లోకి వెళ్లండి

29 గ్రామాల ప్రజలు మా జెండా పీకాలంటే.. 26 జిల్లాల ప్రజలు టీడీపీని కూకటివేళ్లతో పెరికేస్తారు

ఆడవాళ్లను ప్రజల్లోకి వెళ్లి ప్రశ్నించలేని లోకేశ్, అసెంబ్లీకి రాలేని చంద్రబాబు మాపై విమర్శలేంటి?

 

అమ‌రావ‌తి: టీడీపీ వాళ్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. పళ్లు రాలతాయ్‌..అని మంత్రి ఆర్కే రోజా హెచ్చ‌రించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద‌ మంత్రి ఆర్కే రోజా మాట్లాడారు. టీడీపీ 5 ఏళ్ళపాటు అధికారంలో ఉండి, కేవలం పచ్చ మీడియాలో గ్రాఫిక్స్‌ చూపించబట్టే ఈ ప్రాంతంలో (అమరావతి) ఉన్న రెండు ఎమ్మెల్యే సీట్లను 2019లో వైయస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో రైతులకు, ప్రజలకు న్యాయం చేయలేదని గుర్తించబట్టే వైయస్‌ఆర్‌సీపీని గెలిపించారు. 

- పనికిమాలిన టీడీపీ వాళ్లు వైయస్‌ఆర్‌సీపీ గద్దెను, ప్రభుత్వాన్ని కదిలించేస్తామంటున్నారు. 29 గ్రామాల్లో మీరు, మీ బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికి.. 26 జిల్లాల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటానికి ఎవ్వరూ ఒప్పుకోరు.  అమరావతిలోని 29 గ్రామాల ప్రజలు మా జెండా పీకాలంటే.. 26 జిల్లాల్లోని ప్రజలు టీడీపీని కూకటివేళ్లతో సహా పెరికిపారేస్తారన్న సంగతి తెల్సుకోవాలి. 

-  మహానేత వైయస్‌ఆర్‌ గారిని కాంగ్రెస్ అవమానిస్తే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు వచ్చి.. ఎన్నికలకు వెళ్తే ప్రజలంతా వైయస్‌ఆర్‌సీపీకి అండగా నిలిచారు. 

- ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ఆ ఎంపీలకు ప్రజలు మద్దతుగా నిలిచారు. అదేవిధంగా టీడీపీ వాళ్లు అమరావతినే మూడు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారని కోరితే మేం ఎందుకు రాజీనామా చేయాలి. టీడీపీ వాళ్లు రాజీనామా చేసి మూడు ప్రాంతాలు కావాలా? అమరావతిలోనే అభివృద్ధి చాలా అంటే ఆరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది. 

- ప్రతిసారీ సీఎం వైయ‌స్ జగన్ గారిని రాజీనామా చేయ్.. అని పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. పళ్లు రాలతాయి.  లోకేశ్ ఓ పిల్లిబిత్తిరి. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. అలాంటి లోకేశ్ సీఎం గారిని ఏకవచనంలో మాట్లాడతాడా. 

- సీఎం వైయ‌స్ జగన్ గారు తన సొంత జెండా, అజెండాతో ప్రజల్లో తిరిగి భరోసా కల్పించుకొని తిరుగులేని నాయకుడు అయ్యారు. తాను ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చారు. ప్రతి ఇంట్లో ఒక బిడ్డలా సీఎం శ్రీ జగన్ ముందుకు వెళ్తున్నారు. 

-  లోకేశ్ ఏమో.. భార్యతో, అమ్మతో.. నాన్న మీద ప్రెజర్ పెట్టించి.. రాంగ్ రూట్‌లో ఎమ్మెల్సీ అయి మంత్రి అయినవాడు. నువ్వు సీఎం జగన్ గురించి మాట్లాడటం ఏంటి. కెమెరాలున్నాయని ఏవిపడితే అవి మాట్లాడితే.. ఊరుకోం. 

- ప్రజల సమస్యలు ఏవైనా పరిష్కారం కాలేదంటే మాట్లాడండి. ప్రజల్లోకి వెళ్లి మాట్లాడండి. ఆ దమ్ము, ధైర్యమూ లేదు. వాళ్ల నాన్నకు అసెంబ్లీకి వచ్చేదానికి ధైర్యమూ లేదు. ప్రజల్లోకి వెళ్లటానికి ధైర్యమూ లేదు. కేవలం ప్రజల్ని రెచ్చగొట్టి అందరి సమాయాన్ని వృధా చేసే కార్యక్రమాన్ని చేయొద్దు. లా అండ్ ఆర్డర్‌కు సమస్యలు వచ్చే కార్యక్రమం చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలోకి ప్రజలు అడుగుపెట్టనివ్వరు. 

- కొడాలి నాని, నేను (ఆర్కే.రోజా) టీడీపీ నుంచి వచ్చాం. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు వచ్చి తన స్వార్థం కోసం పార్టీని, రాష్ట్రాన్ని నాశనం చేశారు కాబట్టే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశాం. కొడాలి నాని గారు మాట్లాడిన మాటల్లో ఏం తప్పు ఉంది? శ్రీ జగన్ గారిపై అవాకులు చెవాకులు మాట్లాడితే చూస్తూ ఉంటామా. కొడాలి నాని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. ఆడవాళ్లను ఇళ్ల మీదకు పంపిస్తారా? కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుకను కూడా తెలుగుదేశం వాళ్లు పీకలేరు. మేమంతా మా నాయకుడికి అండగా నిలబడతాం. ప్రజల్ని సొంత కుటుంబంలా ప్రేమించి వారికి మంచి చేయాలని అహర్నిశలు కష్టపడే మనసున్న నాయకుడు జగన్ గారు. ఆయన కోసం ప్రాణాలు ఇవ్వటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. 

- కొడాలి నాని, ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి భయపెడతాం అంటే సహించం. టీడీపీ వాళ్లు ఎలా వెధవ పనులు చేశారో చూశాం. ఎలా మంత్రి విశ్వరూప్ ఇంటిని తగలబెట్టారో, అంబటి రాంబాబు ఇంటి మీదకు పోయారో చూశాం.  టీడీపీ వాళ్లు పోలీసులు ఏమీ అనకూడదు. పోలీసులు కేసులు పెట్టకూడదు. తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తే మాత్రం కక్షసాధింపు చర్యలు అంటారు. 

- ప్రజలకు సేవ చేయటానికి మేమంతా ఉంటే.. టీడీపీ వాళ్లు రౌడీయిజం చేస్తూ.. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ ఇళ్ల మీదకు వెళ్తున్నారు. ఈసారి ఎవరి ఇంటి మీదకు దాడికి వెళ్తే తిరగబడి తంతాం అంటూ మంత్రి రోజా హెచ్చ‌రించారు.

తాజా వీడియోలు

Back to Top