కౌలు రైతులకూ రైతుబాంధవుడు సీఎం వైయస్‌ జగన్‌ 

ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
 

కాకినాడ: కౌలు రైతులకూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు బాంధవుడిగా మారడని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. కరప గ్రామంలో ఏర్పాటు చేసిన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్న మాట నిలబెట్టుకునే వారు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే. ఇచ్చిన మాట జవ దాటని నేత దివంగత మహానేత వైయస్‌ఆర్‌ అయితే..ఆయన బాటలో వైయస్‌ జగన్‌ కూడా ఇచ్చిన మాట నెరవేర్చి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా, చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి అత్యధికంగా పండిస్తూరాష్ట్రంలోనే కాదు..దేశానికే అన్న పెడుతున్న ఈ రెండు జిల్లాలను ఆ నాడు వైయస్‌ఆర్‌ ఆదరించారు. ఈనాడు సాగు చేస్తున్న రైతుల పట్ల వైయస్‌ జగన్‌ కరుణ చూపిస్తున్నారు. రైతులు కొంత నిర్లప్తింగా ఉండగా, వారికి వైయస్‌ జగన్‌ భరోసా కల్పిస్తూ, భూ యజమానులకు, కౌలు రైతులకు న్యాయం చేస్తున్నారు. ఉదారంగా రైతులను ఆదుకుంటున్నారు. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా రైతులు ఒకప్పుడు ఉత్సాహంగా సాగు చేసేవారు. ఇప్పుడు నష్టాల్లో ఉన్నారు. ఇక్కడి రైతులు దాదాపు 5 లక్షల మంది వలస వెళ్లారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందరికి ఇతోధికంగా సాయం చేసేందుకు ముందుకు వచ్చిన వైయస్‌ జగన్‌ను అభినందించాలని కోరారు. రాష్ట్రంలోనే 2.60 లక్షల మంది వాలంటీర్లను, 1.30 లక్షల మందిని సచివాలయ ఉద్యోగులుగా నియమించారని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు.
 

తాజా వీడియోలు

Back to Top