ఎస్‌ బ్యాంకు మూలాలన్నీ కరకట్ట బంగ్లాలోనే..

కేంద్ర ఆర్థిక శాఖ క్షుణ్ణంగా విచారణ చేయించాలి

రాణాకపూర్‌తో చంద్రబాబు సంబంధాలు తేలుతున్నాయి

దోచుకున్న సొమ్మునంతా ఎస్‌ బ్యాంకు ద్వారా తరలించారని సందేహం

ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐటీ దాడులపై బాబు ఎందుకు మాట్లాడడం లేదు

14 ఏళ్లలో బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు

సినిమాలు చేసుకోకుండా మళ్లీ మేనిఫెస్టో గోల ఏంటీ.. పవన్‌ నాయుడు

సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని

 

తాడేపల్లి: లెక్కకు మిక్కిలిగా చంద్రబాబు కుంభకోణాలు తేలుతున్నాయని, రాష్ట్రాన్ని దోపిడీ చేసి సొమ్ము ఏరకంగా విదేశాలకు తరలించి దాచుకున్నాడో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, ఇన్‌కంట్యాక్స్‌ జరిపిన దాడుల్లో దాని మూలాలు కరకట్టలోని అక్రమ బంగ్లాలో మూలాలు తేలుతున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రజలు చెమటోడ్చి సంపాదించిన డబ్బును టిట్కో ద్వారా రూ.11 వందలకు నిర్మించాల్సిన చదరపు అడుగు రూ.2400 పేదల డబ్బు కాంట్రాక్టర్లకు చెల్లించి అక్కడి నుంచి వేల కోట్ల ముడుపులు తీసుకున్నాడని, ఆ సొమ్మును ఎస్‌ బ్యాంకు ద్వారా విదేశాలకు హవాలా రూపంలో తరలించాడని సందేహాలు ఉన్నాయన్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఎస్‌ బ్యాంకు అధినేత రాణా కపూర్‌తో చంద్రబాబుకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లారంటే.. ‘ఎస్‌ బ్యాంక్‌ అధినేత రాణాకపూర్‌ అనే ఆర్థిక నేరగాడు.. ప్రజలు దాచుకున్న డబ్బు ఏ విధంగా దోచుకున్నాడో చూస్తున్నాం. రాణాకపూర్‌ మూలాలు కూడా కరకట్ట బంగ్లాలో తేలడం తెలుగు ప్రజలు సిగ్గుపడే విషయం. లెక్కకు మిక్కిలికిగా చంద్రబాబు కుంభకోణాలు తేలుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి వేల కోట్లు దోచుకున్న డబ్బులోంచి పాపాన్ని పంచినట్లుగా పంచాడని అర్థం అవుతుంది. ఎన్టీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీని స్థాపిస్తే.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఆయన ఆశయాలకు బాబు తూట్లు పొడిచాడు. కాంగ్రెస్‌కు జీవం పోయడం కోసం దోచుకున్న వేల కోట్లలో కొంత భాగాన్ని అప్పగించాడు.

ఎస్‌ బ్యాంకులో మూలాలు అన్నీ చంద్రబాబు దగ్గరే తేలుతున్నాయి. సాక్షాత్తు.. కలియుగ దైవంగా మనం కొలుచుకునే వెంకటేశ్వరస్వామి డబ్బులను రూ.13 వందల కోట్లను రూల్స్‌కు విరుద్ధంగా ఎస్‌ బ్యాంకులో దాచాడు. అక్కడితో ఆగకుండా టూరిజం డిపార్టుమెంట్‌తో బిజినెస్‌ పాట్నర్‌షిప్‌ ఏర్పాటు చేసుకోవడం. అలాగే ఎన్‌ఆర్‌ఐకి సంబంధించిన నాన్‌ రిసిడెంట్‌ తెలుగు సొసైటీకి వ్యూహాత్మక భాగస్వామిగా ఎస్‌ బ్యాంకును నియమించడం. ఢిల్లీలో ఎస్‌ బ్యాంకుతో చేతులు కలిపి గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌ ఏర్పాటు చేశాడు. టూరిజం మిషన్‌ డాక్యుమెంట్‌ ఎస్‌ బ్యాంకుకు అప్పగించి లక్షల రూపాయలు ఫీజులు కట్టాడు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరుతున్నాం.. ప్రజల వేల కోట్ల రూపాయల సొమ్మును దిగమించిన రాణా కపూర్‌తోనే ఆగకుండా.. అతనికి పాట్నర్‌గా ఉండి.. వేల కోట్లు దోచుకొని హవాలా నడిపిన ఎస్‌ బ్యాంకును హవాలా మార్గంగా ఎంచుకున్న పరిస్థితిని క్షుణ్ణంగా పరిశోధన చేయాలని కోరుతున్నాం. చంద్రబాబు గత ఐదేళ్లలో దోచుకున్న ప్రజా ధనాన్ని దేశం బయటకు పంపించేందుకు ఎస్‌ బ్యాంకును వాడుకున్నారనే సందేహం ఉంది. ప్రతి నెలకు ఒకసారి రాణాకపూర్‌ ఒక రాత్రంతా కరకట్ట బంగ్లాలో గడపడం. ఈ చరిత్ర చూస్తుంటే.. చంద్రబాబు దోచుకున్న సొమ్మును దాచుకోవడం కోసం ఎస్‌ బ్యాంకును వాడుకున్నాడని సందేహాలు ఉన్నాయి కాబట్టి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ క్షుణ్ణంగా పరిశీలన చేయాలి.

ఎక్కడైనా జగన్‌కు లింకు దొరుకుతుందోనని ఐదేళ్లు తపస్సు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడిన చంద్రబాబు ఒక్కదానికి నోరు మెదపడం లేదు. ఎప్పుడు నోటీసులు వస్తాయో అని ఎదురుచూస్తే పరిస్థితి. పెద్ద పెద్ద న్యాయవాదులను సంప్రదించి ఆ కేసుల్లోంచి ఎలా బయటపడాలని ఆలోచనలో ముగినిపోయాడు. ఎస్‌ బ్యాంకు గురించి ఒక్క రోజు నోరెత్తడం లేదు. పీఎస్‌ మీద ఇన్‌కంట్యాక్స్‌ రైడ్‌ జరిగితే రూ.2 వేల కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగాయని తేలినా నోరు మెదపడు. ఇవాళ బీసీ కోటా గురించి మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు మేలు చేసేందుకు ఒక్క ఆలోచన పాపాన పోలేదు. కేవలం ఓట్ల కోసం, అవసరాల కోసం బీసీలను వాడుకున్నాడు. బీసీలు జడ్జిలుగా పనికిరారు.. వారికి మేధస్సు ఉండదని మాట్లాడిన చంద్రబాబు.. ఇవాళ బీసీలపై మొసలి కన్నీరు కార్చితే ప్రజలు గుర్తిస్తారనే భ్రమలో బతుకుతున్నాడు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ కల్పిస్తూ జీఓ రాష్ట్ర ఈసీకి పంపిస్తే.. దాన్ని అడ్డుకున్నాడు. కోర్టు తీర్పును గౌరవిస్తూనే.. 34 శాతం సీట్లు వైయస్‌ఆర్‌ సీపీ తరుఫున ఇస్తామని ప్రకటించిన తరువాత మేము కూడా ఇస్తామని బాబు ప్రకటించారు.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక్క క్షణం అయినా స్థానిక సంస్థల్లో, నామినేటెడ్‌ పదవులు, మార్కెట్‌ యార్డులు, దేవాలయాల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించాలనే ఆలోచన ఎందుకు చేయలేదు. బీసీలను ఓట్ల కోసం వాడుకునే చంద్రబాబు మొసలి కన్నీరు కార్చితే ప్రజలు నమ్మరు. చంద్రబాబుది ఫ్యూడల్‌ మనస్తత్వం.

పవన్‌ నాయుడు స్థానిక ఎన్నికల్లో మేనిఫెస్టో ఇస్తామని చెప్పాడు. 2014లో ప్రశ్నించడమే మా మేనిఫెస్టో అన్నారు. ఐదేళ్లలో మోడీ, చంద్రబాబును ప్రశ్నించలేదు. నాటి ప్రతిపక్ష నేత అయిన వైయస్‌ జగన్‌ను ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో మరో మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో ఏయే సంగతులు ప్రకటించారు..? అధికారం లేకపోతే ఏమీ చేయలేమా..? నన్ను చూసి నేర్చుకో అని వైయస్‌ జగన్‌ను ఉద్దేశించి గతంలో మాట్లాడారు. ఈ తొమ్మిది మాసాల్లో ప్రజలకు ఏం చేశారు. బ్రహ్మాండమైన పాలన చేయండి.. నేను సినిమాలు చేసుకుంటాను అని పవన్‌ మాట్లాడాడు. సీఎం వైయస్‌ జగన్‌కు కితాబు ఇస్తూ ఏకంగా ఐదు సినిమాలు చేసుకుంటున్నాడు. మళ్లీ సినిమాలు చేసుకోకుండా మేనిఫెస్టో గోల ఏంటీ..? మళ్లీ ఎవరిని మోసం చేద్దామని.. సినిమా షూటింగ్‌ లేని రోజు చంద్రబాబుకు ఒక కాల్‌షీటు. ప్రజా వంచన నాయకత్వం చేయడం ఎంత వరకు సమంజసం. పెద్ద పెద్ద తాత్విక పుస్తకాలను కళ్లజోడు పెట్టుకొని చదువుతున్నారో లేదో కూడా తెలియకుండా చదివే గొప్ప మేధస్సు ఉన్న పవన్‌.. ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టడం ఆపాలని పవన్‌ నాయుడిని కోరుతున్నాను.

Back to Top