విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలు జరగడం లేదు

పంచాయతీ రాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలు జరగడం లేదని పంచాయతీ రాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకే లేటరైట్‌కు అనుమతిచ్చామని స్పష్టం చేశారు.  చంద్రబాబు హయాంలోనూ లేటరైట్‌కు లీజులు ఇచ్చారని, అప్పుడు తవ్వితే లేటరైట్‌.. ఇప్పుడు తవ్వితే బాక్సైట్‌ అవుతుందా..? అని ప్రశ్నించారు. టీడీపీ దుష్ప్రచారంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చాకే శాశ్వతంగా బాక్సైట్‌ తవ్వకాల జీవోలు రద్దు చేశారన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమ మైనింగ్‌పై విచారణ జరిపామని చెప్పారు. అక్రమంగా 2 లక్షల టన్నులు తవ్వినందుకు రూ.20 కోట్ల జరిమానా వేశామన్నారు. 
 

Back to Top