ఒక పార్టీకి, కులానికి మేలు చేసేలా నిమ్మగడ్డ వైఖరి

ప్రజల ఆరోగ్యం ఎస్‌ఈసీకి పట్టదా..?

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం

తిరుపతి: చంద్రబాబు డైరెక్షన్‌లో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నడుచుకుంటున్నారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. కరోనా కేసులు తక్కువ ఉన్న సమయంలో చంద్రబాబు మాటలు విని స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా వేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. కోవిడ్‌ సేకండ్‌ వేవ్‌ ఉన్న సమయంలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నిమ్మగడ్డ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఒక వ్యక్తికి, ఒక కులానికి, ఒక పార్టీకి మేలు చేసేలా నిమ్మగడ్డ నిర్ణయాలు ఉన్నాయన్నారు. ప్రజల ఆరోగ్యం ఎస్‌ఈసీకి పట్టదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం చేయలేదనేది అందరికీ తెలుసన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top