సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలి

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌ శాఖ  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రస్థాయి డీఆర్‌డీఏ, పీడీల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఆర్‌డీఏ పీడీలు ప్రతినెలా 15 రోజులు ఫీల్డ్‌లో పనిచేయాలన్నారు. గ్రామీణాభివృద్ధి పథకాల అమలును స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. నవరత్నాలను గ్రామస్థాయిలో అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అదనంగా 7 లక్షల మందికి వైయస్‌ఆర్‌ పెన్షన్లు అందించనున్నట్లు వివరించారు. పొదుపు సంఘాలు చెల్లించాల్సిన రుణాలను నాలుగు విడతలుగా వారి చేతికే అందిస్తామని వివరించారు. 

Read Also: వారే ఎదుటివారి కష్టాలు తీర్చగలరు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top