చంద్రబాబు అండ్ బృందానికి అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత లేదు

మంత్రి మేరుగు నాగార్జున‌

 బాపట్ల: టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ బృందానికి అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత లేదని మంత్రి  మేరుగు నాగార్జున అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్న చంద్రబాబు  నాతో బహిరంగ చర్చకు  సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... అంబేద్కర్ విద్యా దీవెన పథకం చంద్రబాబు పాలనలో నిర్వీర్యం అయిందన్నారు. టీడీపీ   హయాంలో చాలా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. చంద్రబాబు రాజధాని తీసుకెళ్లి తుప్పల్లో పెట్టారని మండిపడ్డారు. అంబేద్కర్ పేరుతో ఉన్న స్కీములు ఆపేసింది చంద్ర‌బాబే అన్నారు.  ఇప్పుడు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని టీడీపీ అడ్డుకుందన్నారు. ఎస్సీలో ఎవరైనా పుడతారా అని చంద్ర‌బాబు అన్నప్పుడు వ‌ర్ల రామ‌య్య ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు.  నువ్వు ఎస్సీవి కాదా? నువ్వు ఎస్సీల్లో పుట్టలేదా వర్ల రామయ్య అంటూ మంత్రి నాగార్జున నిల‌దీశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top