జూన్‌లో కియా ప్లాంట్ మ‌రొక‌టి రాబోతుంది

కియా తరలిపోతుందని టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

ఢిల్లీ: ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన కియా మోటార్స్‌ ప్రతినిధులతో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై నమ్మకంతో కియా మోటార్స్‌ మరొక పరిశ్రమను కూడా పెట్టబోతోందని, జూలై నెలలో మరో కియా ప్లాంట్‌ వస్తుందన్నారు. కియా మోటార్స్‌ తమిళనాడుకు వెళ్తోందని టీడీపీ నేతలు విషప్రచారం చేశారని, కానీ, కియా మోటార్స్‌తో మాట్లాడలేదని తమిళనాడు ప్రభుత్వమే స్వయంగా చెప్పిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెడుతున్నారని, ఒప్పందాలను గౌరవిస్తూ అమలు చేస్తున్నాం. శ్రీ సిటీ కంటే మెరుగైన దానిని తీసుకొచ్చేందుకు పాలసీ రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు. చంద్రబాబు దిగజారి మాట్లాడడం బాధాకరమని, మా ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఇలాంటి విషప్రచారం చేయిస్తున్నాడని మంత్రి గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. 
 

తాజా వీడియోలు

Back to Top