అందితే కాళ్లు.. లేదా వెన్నుపోటు ఇదే బాబు సంస్కృతి

చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం

పారిపోవడం, చీకట్లో కాళ్లు పట్టుకోవడంలో చంద్రబాబు మించినవారు లేరు 

ఆసరా పింఛన్ల కోసం నెలకు రూ.1500 కోట్లు కేటాయిస్తున్నాం

దరఖాస్తు చేసుకున్న రోజుల వ్యవధిలో పెన్షన్‌ మంజూరు చేస్తున్నాం

అర్హులందరికీ పథకాలు అందించడమే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం

అసెంబ్లీ: చంద్రబాబు లాంటి దిగజారుడు రాజకీయాలు ఎవరికీ రావని, అందుతే కాళ్లు.. లేదంటే వెన్నుపోటు పొడవడం చంద్రబాబు సంస్కృతి అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి దొంగదారిన అధికారంలోకి వచ్చిన ఫేక్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు,ఫేక్‌ ప్రతిపక్ష నాయకుడు.. ఆ పార్టీ ఫేక్‌ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిపోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ..

2004లో 74 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చిన మహానుభావుడు దివంగత మహానేత వైయస్‌ఆర్‌ అని కొనియాడారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటికీ 17 లక్షల పెన్షన్లు ఉంటే.. బాబు దిగిపోయేటప్పటికీ అదే 17 లక్షల పెన్షన్లు ఉన్నాయి. వితంతువు, వృద్ధాప్య పెన్షన్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటేనే పెన్షన్‌ అందుకునే లబ్ధిదారుల నుంచి ఎవరైనా చనిపోతేనే ఇంకొకరికి ఇచ్చేవాడు చంద్రబాబు. అలాంటి నీచపు పాలన చేశాడు. కానీ, దివంగత మహానేత వైయస్‌ఆర్‌ పారదర్శక పద్ధతిలో 74 లక్షల పెన్షన్లు ఇచ్చారు. 

ఆయన తనయుడు వైయస్‌ జగన్‌.. పెన్షన్‌ వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించి పెన్షన్‌ రూ.2,250కి పెంచారు. ఫిబ్రవరి, మార్చిలో మరో రూ.250 పెంచుతారు. అర్జీ పెట్టుకుంటే రోజుల వ్యవధిలోనే మంజూరు చేసే వ్యవస్థను సీఎం తీసుకువచ్చారు. కొత్తగా 7 లక్షల పెన్షన్లు చేరాయి. పెన్షన్ల లెక్కలు చూసుకుంటే ఐదేళ్లలో లక్ష కోట్లకు పైగా పెన్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్లలో కలిపి రూ.30 వేల కోట్లు కూడా పింఛన్లకు ఖర్చు చేయలేదు. చంద్రబాబు హయాంలో పెన్షన్లకు నెలకు రూ.490 కోట్లు కేటాయిస్తే.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నెలకు రూ.1500 కోట్లు ఇస్తున్నారన్నారు. 

పారిపోవ‌డంలో చంద్రబాబు సిద్ధ‌హ‌స్తుడు

– మొదట మొదలెట్టింది చంద్రబాబు.. 1983లో ఓడిపోగానే కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశంలోకి పారిపోయాడు. 
– చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు. 
– ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్‌ నుంచి కరకట్టకు పారిపోయాడు. 
– కరోనా రాగానే కరకట్ట నుంచి హైదరాబాద్‌ అద్దాల మేడలోకి పారిపోయాడు. 
– నల్ల దుస్తులు వేసుకొని ఢిల్లీ వాళ్లకు తెలుగు రాదని మోడీని తెలుగులో తిట్టడం. 
– ముసుగేసుకొని వెళ్లి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నాడు. 
– దొరికిన వాళ్లందరితో పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తాడు.. గెలిచిన తరువాత అంతా నా ప్రతిభే అని పొత్తు పార్టీలను గెంటేస్తాడు. 
– ఏలేరు కుంభకోణం వంటి స్కామ్‌లలో పారిపోయి 18 స్టేలు తెచ్చుకున్నాడు. – అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ గురించి విచారణపై కోర్టుకు వెళ్లి వ్యవస్థలను మేనేజ్‌ చేసి స్టే. 

 

Back to Top